కులకచర్ల, అక్టోబర్ 24 : రైతులకు నష్టం కలుగకుండా అసైన్డ్‌భూముల సమస్యను పరిష్కరిస్తామని వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. గురువారం మండలంలోని అల్మాస్ఖాన్పేట్ గ్రామంలో పరిగి ఎమ్మె ల్యే రామ్మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు భూముల దగ్గరకు వచ్చి సమస్యలను తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. అసైన్డ్ భూ ములకు సంబంధించి ప్రభుత్వం ఇచ్చే కాగి తం మీ చేతుల్లో ఉంటే ఎలాంటి భయం అవసరం లేదన్నారు. అర్హులైన రైతులు నష్టపోకుండా ఉండేందుకు వారికి పట్టాదారు పాస్ పుస్తకాలను అందిస్తామని .. వాటితో రైతుబీమా, రైతుభరోసా పథకాలను పొందవచ్చునని పేర్కొన్నారు.
అనంతరం పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి మా ట్లాడుతూ అల్మాస్ఖాన్పేట్ భూముల సమస్య పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తున్నదన్నారు. అనంతరం వారు చౌడాపూర్ మండలంలోని మక్తవెంకటాపూర్, మందిపల్ గ్రామాలకెళ్లారు. ఈ రెండు గ్రామాల పరిధిలో ఉన్న అసైన్డ్ భూములను సర్వే చేసి రైతుల ఆధీనంలో ఉన్న భూమిని గుర్తించి సరిచేస్తామన్నారు. రైతులు ఆందోళన చెందొద్దని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ లింగ్యానాయక్, ఆర్డీవో వాస్తు, సర్వే ల్యాండ్ ఏడీ రాంరెడ్డి, కులకచర్ల ఎంపీడీవో రామకృష్ణ, తహసీల్దార్ మురళీధర్, డీసీసీ ఉపాధ్యక్షుడు భీంరెడ్డి, ఆంజనేయులు, అశోక్‌కుమార్, ఆనందం, బచ్చిరెడ్డి, అల్మాస్ఖాన్పేట్ రెవెన్యూ గ్రామాలకు చెందిన రైతులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.