Vikarabad | వికారాబాద్‌లో దారుణం.. కుటుంబ సభ్యులను కత్తితో గొంతుకొసి చంపేశాడు..
వికారాబాద్ జిల్లా (Vikarabad) కులకచర్లలో (Kualakacharla) దారుణం చోటుచేసుకుంది. భార్య పిల్లలతోసహా వదినను కత్తితో నరికి చంపేశాడు. కులకచర్లకు చెందిన వేపూరి యాదయ్య, అలివేలు (35) దంపతులు.
వికారాబాద్: వికారాబాద్ జిల్లా (Vikarabad) కులకచర్లలో (Kualakacharla) దారుణం చోటుచేసుకుంది. భార్య పిల్లలతోసహా వదినను కత్తితో నరికి చంపేశాడు. కులకచర్లకు చెందిన వేపూరి యాదయ్య, అలివేలు (35) దంపతులు. వారికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో అలివేలు, ఆమె ఇద్దరు పిల్లలను తీసుకెళ్లడానికి యాదయ్య వదిన హన్మమ్మ వారి ఇంటికి వచ్చింది. వారంతా నిద్రలో ఉండగా భార్య అలివేలు, కూతురు అపర్ణ (13), హన్మమ్మ (40)ను కత్తితో గొంతుకోసి చంపేశాడు. అనంతరం యాదయ్య కూడా ఆత్మహత్య చేసుకుని మృతిచెందాడు.
పెద్ద కూతురిని కూడా చంపడానికి ప్రయత్నించాడు. అయితే ఆమె తల, చేతికి గాయాలతో తప్పించుకున్నది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆర్ధిక సాయం
CJP | జంతర్‌మంతర్ వద్ద నిరసనలకు అనుమతివ్వండి.. ఢిల్లీ పోలీసులకు సీజేపీ 24 గంటల డెడ్‌లైన్..!
Manne Krishank | మీ సొంత కూతురే కార్పొరేట్ స్కూల్ నిర్మిస్తున్నది కదా.. రేవంత్ రెడ్డిని ప్రశ్నించిన మన్నెక్రిశాంక్
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

