కులకచర్ల, జూన్ 15: పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి చౌడాపూర్ మండల ముదిరాజ్ సంఘాల అధ్యక్షుడు కృష్ణయ్య రూ.1,00,000 రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌడాపూర్ పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి తనవంతుగా లక్ష రూపాయలు విరాళం అందిస్తున్నట్లు తెలిపారు. దేవాలయం అభివృద్ధికి తనసహాయమని అన్నారు. చౌడాపూర్ మండలంలో ముదిరాజ్ ల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.
ముదిరాజులు అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు. ఐక్యత తో అన్ని రంగుల్లో అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా పోచమ్మ తల్లి దేవాలయం నిర్మాణానికి లక్ష రూపాయలు విరాళం అందించిన కృష్ణయ్యను పలువురు అభినందించారు. పోచమ్మ తల్లి ఆశీస్సులు అతని కుటుంబానికి అతనిపై ఎల్లప్పుడూ అండగా ఉండాలని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో చౌడాపూర్ పోచమ్మ తల్లి దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.