బొంరాస్పేట,ఆగస్టు 20 : బొంరాస్పేట, దుద్యాల రెండు మండలాల రైతులు పీఎసీఎస్ బ్యాంకు అందిస్తున్న వ్యవసాయ రుణాలను సద్వినియోగం చేసుకోవాలని పీఎసీఎస్ చైర్మన్ జయకృష్ణ అన్నారు. రైతులు తమ బ్యాంకులో తీసుకున్న పాతరుణాలు 50శాతం వరకు రికవరి పూర్తిచేయడంతో కొత్తగా రైతులకు రుణాలు ఇస్తారన్నారు. అలాగే వ్యవసాయ రుణాలు తీసుకున్న రైతులు తమ రుణాలను సకాలంలో రెనివల్ చేయడం ద్వారా రైతులకు 89పైసలు మిత్తితో ఈ రుణాలను అందించడంతోపాటు 3శాతం వరకు రాయితీ కూడా లభిస్తుందన్నారు.
రైతులు ఈ ఆవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు ఒకే బ్యాంకులో రుణాలను కలిగి ఉండాలని సూచించారు. అలాగే దీర్ఘకాలీక రుణాలను కూడా తమ బ్యాంకు ద్వార అందించడం జరుగుతుందని అందులో డైరీఫామ్స్, కర్షకమిత్ర, ఫౌల్ట్రీ, ఆర్వెస్టర్, షీప్, ట్రాక్టర్ల కోసం రుణాలను అందిస్తున్నామని రూ.15లక్షల వరకు పరిమితి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫీల్డ్ ఆఫీసర్ రామకృష్ణ, సీఈఓ రమేష్, పీఎసీఎస్ సిబ్బంది పాల్గొన్నారు.