వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని కేజీబీవీలలో మిగిలిన 12 (స్పెషల్ ఆఫీసర్, పీజీసీఆర్టీ, సీఆర్టీ, పీఈటీ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి రేణుకాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2022-23 విద్యా సంవత్సరంలో నిర్వహించిన పరీక్ష మెరిట్ లిస్టులోని అభ్యర్థులను రోస్టర్, మెరిట్ ఆధారంగా 1:3 నిష్పత్తి ప్రకారం దరఖాస్తులు తీసుకోనున్నారు.
డీఈవో కార్యాలయంలోగల నోటీసు బోర్డులో పొందుపరిచిన లిస్టులో ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. జూలై 3న వికారాబాద్‌లోని జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు. సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్స్, రెండు సెట్ల జిరాక్స్ పత్రాలతోపాటు రెండు పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలతో హాజరు కావాలని తెలిపారు.