గ్రామాల అభివృద్ధికి కృషి
గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం పరిగి మండల పరిధిలోని చిట్యాల్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు.
పరిగి టౌన్, జనవరి 28 : గ్రామాల అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం పరిగి మండల పరిధిలోని చిట్యాల్ గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పర్చేందుకు కృషి చేస్తున్నానని గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తెస్తే అవసరమైన నిధులను మంజూరు చేస్తానని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో శాశ్వత అభివృద్ధి పనులు చేపడుతున్నదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అరవింద్‌రావు, మున్సిపల్ చైర్మన్ అశోక్‌కుమార్, బీఆర్ఎస్పార్టీ మండల అధ్యక్షుడు ఆర్.ఆంజనేయులు, పరిగి మూడో వార్డు కౌన్సిలర్ వేముల కిరణ్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాణిక్యం, రవికుమార్ పాల్గొన్నారు.
విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి
బీఎంఆర్ ఫౌండేషన్ ద్వారా పదో తరగతి విద్యార్థులకు స్టడీమెటీరియల్‌ను అందజేయడం అభినందనీయమని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం కులకచర్ల మండల పరిధిలోని ముజాహిద్పూర్ గ్రామంలోని ఉన్నత పాఠశాలలో బీఎమ్ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి పదో తరగతి విద్యార్థులకు ఉచితంగా స్టడీమెటీరియల్స్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పదో తరగతి విద్యార్థులు 100శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషిచేయాలని అన్నారు. ప్రభుత్వం విద్యాభివృద్ధికి కృషిచేస్తుందని చెప్పారు. మన ఊరు-మన బడి కార్యక్రమం ద్వారా పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించేందుకు నిధులను మంజూరు చేస్తుందని తెలిపారు. ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి మాట్లాడుతూ పరిగి నియోజకవర్గంలో అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు తన వంతుగా ఉచితంగా స్టడీమెటీరియల్‌ను అందిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్టడీమెటీరియల్‌ను ఉపయోగించుకొని 100శాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.
స్టడీమెటీరియల్ అందజేత..
కులకచర్ల మండల పరిధిలోని బండవెల్కిచర్ల, సాల్వీడ్, కులకచర్ల బాలుర ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి విద్యార్థులకు డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్‌రెడ్డి స్టడీమెటీరియల్ అందజేశారు. ముజాహిద్‌పూర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జడ్పీటీసీ రాందాస్‌నాయక్, ఏఎంసీ చైర్మన్ హరికృష్ణ, పీఏసీఎస్ వైస్ చైర్మన్ నాగరాజు, పరిగి ఎంపీపీ అరవిందరావు, పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, ముజాహిద్పూర్ సర్పంచ్ లక్ష్మి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శేరి రాంరెడ్డి, బీఆర్ఎస్ నాయకులు సారా శ్రీనివాస్, అనంతయ్య, గ్రామస్తులు పాల్గొనగా బండవెల్కిచర్ల ఉన్నత పాఠశాలలో చౌడాపూర్ మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు మొగులయ్య, మొగులయ్య, ప్రధానోపాధ్యాయులు రాములు, సాల్వీడ్, కులకచర్ల గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో కులకచర్ల సర్పంచ్ సౌమ్యారెడ్డి, ఎంఈవో అబీబ్హైమద్, సాల్వీడ్ సర్పంచ్ బాలయ్య, బండవెల్కిచర్ల సర్పంచ్ శిరీష, ఎంపీటీసీ జ్యోతి, పాంబండ చైర్మన్ రాములు, బీఆర్ఎస్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
సీఎం సహాయనిధి పేదలకు వరం
పరిగి టౌన్ : పేదలకు సీఎం సహాయనిధి వరం లాంటిదని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. శనివారం పరిగిలోని ఎమ్మెల్యే నివాసంలో దోమ మండలం మోత్కూర్ గ్రామానికి చెందిన ఏడుగురికి రూ.3.9 లక్షల చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థికసాయం అందజేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో దోమ జడ్పీటీసీ నాగిరెడ్డి, వైస్ ఎంపీపీ మల్లేశం, మండల అధికార ప్రతినిధి శశిధర్‌రెడ్డి, మోత్కూర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు మల్లేశం పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
Horse Riding | పిల్లల్లో హైపర్యాక్టివిటీ తగ్గించడంలో గుర్రపు స్వారీ ఎంతో మేలు.. అధ్యయనంలో వెల్లడి..
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

