కందుకూరు : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమయ్యిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి (Sabita Indra Reddy ) ఆరోపించారు. బుధవారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) దళిత బంధు పథకాన్ని ప్రవేశపెట్టి రూ, 10లక్షలు దళితులను ఇచ్చి ఆదుకున్నారని చెప్పారు.ఈ పథకం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వచ్చినట్లు పేర్కొన్నారు.
కాంగ్రెస్ అధికారంలో రావడానికి ఆచరణలో అమలు కాని హామీలను ఇచ్చిందని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే దళితులకు కేసీఆర్ ఇచ్చిన రూ. 10లక్షలు కాకుండా రూ. 12లక్షలు ఇస్తామని హామీ ఇచ్చి మరిచిపోయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అదికారంలోకి వచ్చి 9నెలలు కావోస్తున్న దళిత బంధు ఎందుకు అమలు చేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు.
ప్రభుత్వం తక్షణమే ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, మాజీ చైర్మన్ ర్యాపాకు ప్రభాకర్‌రెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహ రెడ్డి , తదితరులు పాల్గొన్నారు.