వికారాబాద్, జూలై 9 : వికారాబాద్ జిల్లా కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో గల ఈవీఎం గోడౌన్ ను కలెక్టర్ ప్రతీక్ జైన్ బుధవారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్ కు వేసిన సీళ్లను పరిశీలించి, సీసీ టీవీలో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్లు, ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును తనిఖీ చేశారు.
ఈవీఎం గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును పరిశీలించారు. రిజిస్టర్ల ను పరిశీలించి సంతకాలు చేశారు. తహసిల్దార్ కార్యాలయంలో పూర్తి అయిన మరమ్మత్తు పనులను ఈ సందర్భంగా పరిశీలించారు. కలెక్టర్‌తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ లింగ్యా నాయక్, తహసిల్దార్ లక్ష్మీనారాయణ, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు నేమత్ హాలి, సంబంధిత అధికారులు ఉన్నారు.