వికారాబాద్, జూలై 9 : వికారాబాద్ జిల్లాలోని ప్రతి ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు తాగు నీరు, టాయిలెట్స్, లైట్స్, ఫ్యాన్స్, పెయింటింగ్ తదితర మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలనీ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలు నుంచి ఎంపీడీవోలు, కళాశాలల ప్రిన్సిపాల్స్‌తో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి కళాశాలలో విద్యార్థులకు అవసరమయ్యే తాగునీరు, టాయిలెట్స్, మైనర్ రిపేర్ పనులు, లైట్స్, ఫ్యాన్లు తప్పనిసరిగా పెట్టించాలన్నారు.
ప్రతి కాలేజీ వారీగా మీరు ఇచ్చిన అంచనా ప్రకారం నిధులు మంజూరు చేస్తామన్నారు. పనులపై దృష్టి సారించి ఆగస్టు నెల చివరి నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మేజర్, మైనర్ రిపేర్ పనులకు ముందు తర్వాత ఫొటోలు తప్పనిసరిగా పంపించాలన్నారు. ఈ సందర్బంగా అన్ని మండలాల వారీగా ఎంపీడీవోలు, ప్రిన్సిపాల్స్‌తో కళాశాలలలో ఉండే సౌకర్యాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ హర్ష్ చౌదరి, డీఐవో శంకర్ నాయక్, తదితరలు పాల్గొన్నారు.