వికారాబాద్, ఏప్రిల్ 30 : సమాజం అభివృద్ధికి అట్టడుగు వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు మహాత్మ బసవేశ్వరుడు అని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మహాత్మా బసవేశ్వర 892వ జయంతి వెనుక బడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, అసిస్టెంట్ కలెక్టర్ హర్స్ చౌదరితో కలిసి కలెక్టర్ ముందుగా జ్యోతి ప్రజ్వలన గావించి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..మూఢనమ్మకాల పైన నిరంతరం పోరాటం చేసిన మహానుభావుడు బసవేశ్వరుడు అన్నారు. ప్రప్రథమ సంఘసంస్కర్త సమతవాది అని కలెక్టర్ ప్రశంసించారు. అణగారిన వారి వర్గాల పట్ల ఆశావాది నిరంతర మార్గదర్శకుడని, బసవేశ్వరుని మార్గాన్ని ముందుకు సాగాలని, సమాజ అభివృద్ధికి పాటుపడాలని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో డిబిసిడబ్ల్యూఓ ఉపేందర్, డిఆర్డిఓ శ్రీనివాస్, డిటిడిఓ కమలాకర్ రెడ్డి, డీఎస్ హెచ్ఓ సత్తా ర్, డిఎస్సీ డబ్ల్యూఓ మల్లేశం, డివైఎస్ఓ హన్మంతరావు, జిల్లా అధికారులు, వివిధ శాఖల సిబ్బంది పాల్గొన్నారు.