KTR | బెయిల్ రద్దవుతుందనే భయంతో రేవంత్ రెడ్డి 2,900 ఎకరాలు అప్పగించారు : కేటీఆర్
KTR | మూసీ నది పుట్టిన జన్మస్థలంలోనే చెట్లను చంపేసి.. కిందికి వెళ్లి మూసీ సుందరీకరణ చేస్తామనడం కేవలం కమిషన్ల కోసమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ కలిసి వికారాబాద్ అడవులకు, భవిష్యత్ తరాలకు ఉరివేస్తున్నారు.
KTR | వికారాబాద్ అడవుల్లో 12 లక్షల చెట్లు నరికేసి దామగుండం నేవీ రాడార్ స్టేషన్ కడతామంటే నాడు కేసీఆర్ ఒప్పుకోలేదు. కానీ నేడు మోదీ ఒక్క మాట అడగగానే, బెయిల్ క్యాన్సిల్ అవుతుందనే భయంతో రేవంత్ రెడ్డి 2,900 ఎకరాలు అప్పగించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మూసీ నది పుట్టిన జన్మస్థలంలోనే చెట్లను చంపేసి.. కిందికి వెళ్లి మూసీ సుందరీకరణ చేస్తామనడం కేవలం కమిషన్ల కోసమేనని కేటీఆర్ మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ ఇద్దరూ కలిసి వికారాబాద్ అడవులకు, భవిష్యత్ తరాలకు ఉరివేస్తున్నారు. 93 కోట్ల రూపాయలతో ఆనాడు 2023లో ఆనందన్న నన్నే పిలిచిండు.. నేను,సబితమ్మ వచ్చినం. ఆర్వోబీకి కూడా శంకుస్తాపన చేసినమన్నారు. వికారాబాద్ అభివృద్ధికి నాడు కేసీఆర్ కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజ్, ఆస్పత్రులు నిర్మించారన్నారు కేటీఆర్.
వికారాబాద్, చేవెళ్ల, పరిగి, తాండూరు రైతాంగానికి సాగునీరు అందించేందుకు కోట్‌పల్లిలో దాదాపు 12వేల ఎకరాలకు, బంట్వారంలో 6 వేల ఎకరాలకు , ధరూర్‌లో 22 వేల ఎకరాలకు, మర్పల్లిలో ౩౦ వేల ఎకరాలకు, మోమిన్ పేటలో 18 వేల ఎకరాలకు, వికారాబాద్ మండలంలో సుమారు 10 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చే అద్భుతమైన ప్రాజెక్టు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం చేట్టి, కాంగ్రెస్ ఎన్ని కేసులు వేసినా భయపడకుండా 90% పనులు పూర్తి చేశామని కేటీఆర్ స్పష్టం చేశారు. రిజర్వాయర్లన్నీ పూర్తయి కేవలం పంపులు నడపడమే మిగిలి ఉన్నా, ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేస్తే ప్రజలు కేసీఆర్ గుర్తుంచుకుంటారనే ఒకే ఒక్క ఈర్ష్యతో ఈ రేవంత్ ప్రభుత్వం ప్రాజెక్టును పక్కనబెట్టేసిందని కేటీఆర్ విమర్శించారు.
వికారాబాద్ అభివృద్ధికి నాడు కేసీఆర్ గారు కొత్త కలెక్టరేట్, మెడికల్ కాలేజ్, ఆస్పత్రులు నిర్మించారు. వికారాబాద్, చేవెళ్ల, పరిగి, తాండూరు రైతాంగానికి సాగునీరు అందించేందుకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును చేపట్టి, కాంగ్రెస్ ఎన్ని కేసులు వేసినా భయపడకుండా 90% పనులు పూర్తి చేశాం.… pic.twitter.com/3aIZDk60c0
— BRS Party (@BRSparty) June 28, 2026
Read Also :
Road accident | ట్రాలీ ఆటోను ఢీకొట్టిన లారీ.. ముగ్గురు దుర్మరణం
Sonu Sood | అయోధ్య విరాళాల వివాదంపై స్పందించిన సోనూ సూద్.. బాధ్యులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్!
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Virosh | ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి ముందు తిరుమలలో ప్రత్యక్షమైన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా.. వీడియో వైరల్
Vijay | తమిళనాడు సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

