గ్రామానికి రక్షణ కవచం.. సీసీ కెమెరాలు
సీసీ కెమెరాలు గ్రామానికి రక్షణ కవచంలా పని చేస్తాయని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని మైలార్‌దేవరంపల్లి గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.
వికారాబాద్, జనవరి 17 : సీసీ కెమెరాలు గ్రామానికి రక్షణ కవచంలా పని చేస్తాయని వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ తెలిపారు. మంగళవారం వికారాబాద్ మండల పరిధిలోని మైలార్‌దేవరంపల్లి గ్రామంలో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణలో సీసీ కెమెరాలు ప్రముఖ పాత్రపోషిస్తాయన్నారు. గ్రామంలో ఎలాంటి గొడవ జరిగిన సీసీ కెమెరాల ద్వారా నిందితులను గుర్తించవచ్చని తెలిపారు. ప్రధాన కూడళ్లు, ప్రధాన రహదారుల వెంట ఏర్పాటు చేస్తే గ్రామానికి వచ్చివెళ్లే వారి కదలికలను తెలుసుకోవచ్చని వివరించారు. అనంతరం గ్రామానికి చెందిన ఇతరపార్టీల నాయకులు ఎమ్మెల్యే ఆనంద్ సమక్షంలో బీఆర్ఎస్కండువాను కప్పుకొని పార్టీలో చేరారు. కార్య క్రమంలో రైతు బంధు సమితి అధ్యక్షుడు రాంరెడ్డి, సర్పంచ్ తిరుపతిరెడ్డి, తదితరులు ఉన్నారు. అలాగే వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివారెడ్డిపేటలో ఉదయం మార్నింగ్ వాక్‌లో భాగంగా 4వ వార్డులో పర్యటించారు. వార్డులో నెలకొన్న సమస్యలను ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, నాయకుడు వేణుగోపాల్, తదితరులు ఉన్నారు. వికారాబాద్ మండల పరిధిలోని పాతూర్ గ్రామంలో మైసమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేశారు.
Read Today's Latest Rangareddy Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jammu and Kashmir | జమ్మూ కాశ్మీర్లో అక్రమ చొరబాటుకు యత్నం.. ఇద్దరు ఉగ్రవాదుల కాల్చివేత
Vijayan: మాజీ సీఎం విజయన్ ఇంటికి నోటీసులు అతికించిన ఈడీ
Girl | ఈ యువతి కారుపై ఎక్కి ఏం చేస్తుందో చూడండి.. వీడియో
Music Director Deva | చిత్ర పరిశ్రమలో విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
Mahela Jayawardene | హెడ్ కోచ్ జయవర్ధనేతో బంధానికి తెర.. కొత్త హెడ్‌కోచ్ కోసం ముంబై ఇండియన్స్ కసరత్తు..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

