పెద్దేముల్, జూన్ 4 : వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం తట్టేపల్లి గ్రామంలో ఎక్సైజ్ డీటీఎఫ్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మహమ్మద్ మియా అనే వ్యక్తి ఇంట్లో సోదాలు చేయగా 125 గ్రాముల గంజాయి దొరికింది. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కాగా, నిందితుడు మహమ్మద్ మియాకు గంజాయి ఎక్కడి నుంచి వస్తుందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎక్కడి నుంచైనా కొనుక్కొని తెచ్చాడా? లేదా పొలాల్లో గంజాయి పండిస్తున్నాడా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తాండూరు ఎక్సైజ్ పోలీసులు తెలిపారు.