పరిగి, అక్టోబర్ 10: ఆసరా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునే గడువును సర్కారు మరోసారి పొడిగించింది. అర్హులైన ప్రతిఒక్కరికీ ఆసరా పింఛన్ ఇవ్వాలనే సదుద్దేశంతో మిగిలిపోయిన వారందరూ దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా ఈ గడువు పొడి గించారు. గత ఆగస్టు లో 57 ఏండ్లు నిండిన వారందరూ ఆసరా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు సర్కారు అవకాశం ఇచ్చింది. ఇందులో భాగంగా ప్రతి మండలంలోని గ్రామాల నుంచి అర్హులు దరఖాస్తు చేసుకోగా ఇంకా అనేక మంది దరఖాస్తు చేసుకోలేకపోయారని ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయమై సీఎం కేసీఆర్ సూచన మేరకు వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 30వ తేదీ వరకు అవ కాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదేశాలు జారీ చేశారు. గత నెలలో కల్పించిన అవకాశంతో వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఆసరా వృద్దాప్య పింఛన్ కోసం 21, 256 మంది దరఖాస్తు చేసుకున్నారు.
బంట్వారం మండలంలో 439 దర ఖాస్తులు, బషీరాబాద్‌లో 957 , బొంరాస్‌పేట్‌లో 1320 , చౌడాపూర్‌లో 397, ధారూర్‌లో 1170 , దోమ లో 1220 , దౌల్తాబాద్‌లో 1125 , కొడంగల్‌లో 1179 , కోట్‌పల్లిలో 485, కులకచర్లలో 1006 , మర్పల్లిలో 1361 , మోమిన్‌పేట్‌లో 1123 , నవాబుపేట్ లో 869 , పరిగిలో 1458 , పెద్దేముల్లో 1334 , పూడూరు లో 833 , తాండూరులో 2411, వికారాబాద్‌లో 1604 దరఖాస్తులు అం దా యి. మరోమారు అవకాశం కల్పించ డం తో ఈనెల 11వ తేదీ నుంచి 30వ తేదీ వరకు తమ సమీపంలోని మీ సేవా కేంద్రాల్లో ఆసరా వృద్ధాప్య పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీ సేవ నిర్వాహకులకు ఒక్క రూపాయి చెల్లించకుండా దరఖాస్తు చేసుకునేందుకు సర్కారు నిర్ణయించింది. ఎక్కడా ఏ ఒక్కరికీ రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అందువల్ల అర్హులైన వారు ఉచితంగానే మీ సేవా కేంద్రాల ద్వారా ఆసరా వృద్ధాప్య పింఛన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విషయమై మీ సేవ నిర్వాహకులకు సైతం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
గత నెలలో ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు మీ సేవ కేంద్రాలు సందర్శించి దరఖాస్తు చేసుకునే వారికి అవగాహన కల్పించారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా 75 మీ సేవా కేంద్రాలున్నాయి. దరఖాస్తు చేసుకోవడం పూర్తయిన తర్వాత ఆయా గ్రామాల వారీగా దరఖాస్తులు వర్గీకరించి పింఛన్ కోసం అర్హుల జాబితాను సిద్ధం చేస్తారు. ఈ నెలాఖరు అనంతరం ప్రభు త్వం జారీ చేసే మార్గదర్శకాల ప్రకారం అర్హుల జాబితాను అధికారులు తయారు చేస్తారు.
రంగారెడ్డిజిల్లాలో 1,11,598 మంది లబ్ధిదారులు
రంగారెడ్డిజిల్లా వ్యాప్తంగా చేవెళ్ల, షాద్‌నగర్, ఇబ్రహీంపట్నం, ఆమనగల్లు, మహేశ్వరం, రాజేంద్రనగర్ నియోజకవర్గాల పరిధిలోని 21 మండలాల్లో, మున్సిపాలిటీలలో ప్రతి నెల మొత్తం 1,11,598 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఆసరా పథకం ద్వారా పింఛన్ డబ్బులు అందజేస్తున్నది. ఇందులో వృద్ధ్యాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్ లబ్ధిదారులున్నారు. ప్రభుత్వం ఈ నెల 11 నుంచి 30వరకు కొత్తగా పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించడంతో మరింత మంది లబ్ధిదారులు పెరిగే అవకాశం ఉంది. గతంలో ఏ ప్రభుత్వాలు ఇవ్వని విధం గా తెలం గాణలో టీఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ డబ్బులు పేదలకు ఎంతో ఉపయోగపడతున్నది. ప్రభుత్వ నిర్ణయంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
పింఛన్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభు త్వం మరో అవకాశం కల్పించింది. సోమవారం నుంచి ఈనెల 30వ తేదీ వరకు మీ సేవ కేంద్రాల్లో అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. గత నెలలో దర ఖాస్తు చేసుకోలేకపోయిన వారు ఈసారి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
-కృష్ణన్, డీఆర్డీవో, వికారాబాద్ జిల్లా