మర్పల్లి : వందశాతం వ్యాక్సినేషన్ పూర్తిచేయాలని జడ్పీ సీఈవో జానకిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని సిరిపురం, పట్లూర్ గ్రామాలను ఎంపీడీవో వెంకట్రామ్గౌడ్తో కలిసి సందర్శించారు. సిరిపురంలో మొదటి డోస్ తీసుకొని ఆరు మంది ఉండగా 2కి. మీ నడుచుకుంటు పొలం వద్దకు వెళ్లి వారికి వ్యాక్సిన్ వేశారు. అనంతరం పట్లూర్లో ఆరో వార్డులో నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో 1వ డోసు, రెండో డోసు తీసుకొని వారిని గుర్తించి వారికి వ్యాక్సిన్ వేయ్యాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలకు ప్రతి రెండు రోజులకు నీళ్లు పట్టాలని, ఏవైనా ఎండిన మొక్కలు కనిపిస్తే వాటి స్థానంలో వేరే మొక్కలు నాటాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లయ్య, ఇందిరా అశోక్, ఏఎన్ఎంలు, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.