వికారాబాద్,జూన్ 22 : పోలీసు అధికారులు అందరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వికారాబాద్ ఎస్పీ కె.నారాయణరెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ ఎస్పీ కార్యాలయంలో వీక్లీ పరేడ్‌ను పరిశీలించి, పోలీస్ సిబ్బందికి సలహాలు, సూచనలు చేశారు. పరేడ్ కమాండర్ ఆర్ఐ అంజాద్ పాషా జిల్లా ఎస్పీకి గౌరవ వందనం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్క పోలీస్ అధికారి తమ ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలని, నిత్యం వ్యాయామం కోసం సమయం కేటాయించాలన్నారు.
ఆరోగ్యమే మహాభాగ్యం కావున మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడే సక్రమంగా విధులు నిర్వహించవచ్చన్నారు. మన కుటుంబాన్ని కూడా బాగా చూసుకోవచ్చని, పోలీస్ అధికారులు చురుకుగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా పని చేయాలంటే ఫిట్‌గా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ రవీందర్‌రెడ్డి, డీఎస్పీ శ్రీనివాస్‌రెడ్డి, వికారాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ నాగరాజు, ఏఆర్ డీఎస్పీ వీరేశ్, డేవిడ్ విజయ్ కుమార్, ఆర్ఎస్సైలు, వికారాబాద్ పోలీస్ స్టేషన్ పోలీస్ సిబ్బంది, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు.