కులకచర్ల జనవరి 21: ప్రత్యేక ఓటరు నమో దుకు విశేష స్పందన వచ్చిందని వికారాబాద్ ఆర్డీవో విజయకుమారి తెలిపారు. మండల కేంద్రంలో ఓటర్ల ప్రత్యేక నమోదు ప్రక్రియను ఆదివారం ఆమె పరిశీలించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ..18 ఏండ్లు నిండిన యువతీయువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
గ్రామాల్లో ఎవరూ కూడా ఓటు హక్కు లేదని ఫిర్యాదు రావద్దన్నారు. కార్యక్రమంలో కులకచర్ల తహసీల్దార్ ముర ళీధర్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, ఆర్ఐ ఖాజ, బీఎల్వోలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. అలాగే చౌడాపూర్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న ఓటరు నమోదు కార్యక్రమాన్ని తహసీల్దార్ ప్రభు పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆయన తెలిపారు.
బొంరాస్పేట: జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన యువతీ యువకులు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ వెంకటేశ్ కోరారు. ఆదివారం మండలంలోని బొంరాస్ పేట, కొత్తూరు, రేగడిమైలారం, ఎనికేపల్లి గ్రామాల్లో ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చనిపో యిన వారి పేర్లు, వలస వెళ్లిన పేర్లు, డబుల్ వచ్చిన పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించాలని బీఎల్వోలను ఆదేశించారు.
మండలంలోని అన్ని పోలింగ్ కేంద్రా ల్లో శని, ఆదివారాల్లో ప్రత్యేక ఓటరు నమో దు శిబిరాలను నిర్వహించి అర్హుల నుంచి ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరిం చినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ రవిచారి పాల్గొన్నారు
మర్పల్లి: ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధంతో సమానమని తహసీల్దార్ గణేశ్ అన్నారు. ఆదివారం మండలంలోని సిరిపురం, కొత్లాపూర్, మర్పల్లి తదితర గ్రామాల్లో ఓటరు నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2024 జనవరి ఒకటో తేదీ నాటికి 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల బీఎల్వోలు గ్రామస్తులు పాల్గొన్నారు.