వికారాబాద్ : వికారాబాద్ పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయ సమీపంలో ఉన్న తెరాసా పార్టీ జిల్లా కార్యాలయన్ని శనివారం వికారాబాద్ ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ సందర్శించారు. పార్టీ నాయకులతో కలిసి కార్యాలయ పరిసరాలను పరిశీలించారు. ఎమ్మెల్యేతో పాటు పట్టణ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ రమేశ్‌కుమార్, కౌన్సిలర్ అనంత్‌రెడ్డి, నాయకులు లక్ష్మీకాంత్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్ ఉన్నారు.