పరిగి : పరిగి మండలం కాళ్లాపూర్ పరిధిలోని లొంక ఆంజనేయస్వామి దేవాలయ ఉత్సవాల్లో ఆదివారం పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి పాల్గొని స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా రూ. 10లక్షలు సీడీపీ నిధులు వెచ్చించి ఆలయం ఆవరణలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. స్వామివారి ఉత్సవాల్లో ఎంపీపీ అరవిందరావు, జడ్పీటీసీ బి. హరిప్రియ, మార్కెట్ చైర్మన్ సురేందర్, మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు ఆంజనేయులు, రాఘవాపూర్ సర్పంచ్ నల్క జగన్, పీఏసీఎస్ డైరెక్టర్ హన్మంత్‌రెడ్డి, కాళ్లాపూర్ ఉపసర్పంచ్ జంగయ్య, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.