మోమిన్‌పేట : మత్స్యకారులు ఆర్థికంగా అబివృద్ధి చెందాలని రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం మండలంలోని నందివాగు ప్రాజెక్టులో రోయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారుల అభివృద్ధికి నందివాగు ప్రాజెక్టులో 96వేల రోయ్య పిల్లలను వదిలామన్నారు. మార్కెట్లో రొయ్యలకు మంచి డిమాండ్ ఉంటుందని మత్స్యకారులు మరింత అభివృద్ధి చెందాలనే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు.
కుల వృత్తులకు పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలోమండల అధ్యక్షుడు వెంకట్, పీఏసీఎస్ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, మండల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.