వికారాబాద్ : వికారాబాద్ జిల్లాలోని గిరిజన యువతి, యువకులకు ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి కొఠాజీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. సినిమా ఆధారిత నైపుణ్య శిక్షణ తరగతులు, ఫీల్మ్ అప్ర్పిసియేషన్, స్క్రీన్ యాక్టింగ్ స్మార్ట్ ఫోన్, స్కీన్‌ప్లే యాక్టింగ్ నందు (ఆన్లైన్ ద్వారా) ప్రభుత్వం ఉచితంగా అందించేందుకు నిర్ణయం తీసుకుందన్నారు. ఆసక్తి గల గిరిజన అర్హత కలిగిన యువతీ, యువకులు పూర్తి వివరాలతో నేరుగా జిల్లా కలెక్టర్, గిరిజన అభివృద్ధి అధికారి కార్యాలయం రూం నం. 10నందు, ఈ నెల 18లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నం. 8639388553 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.