వికారాబాద్, మే 3 : మోసపూరిత కాంగ్రెస్‌ను ఓడించి తగిన బుద్ధి చెబుదామని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆనంద్ ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం కోట్‌పల్లి మండలంలోని ఎన్నారం గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఇంటింటికీ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అమలుకాని గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందన్నారు. రేవంత్‌రెడ్డి హామీల అమలును పక్కన పెట్టి.. దేవుళ్ల మీద ఒట్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారన్నారు. గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను ప్రజలు ఆరు గ్యారెంటీలు, రుణమాఫీపై నిలదీయాలన్నారు.
కారుగుర్తుకు ఓటు వేసి కాసాని జ్ఞానేశ్వర్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమాల్లో కోట్‌పల్లి మండల అధ్యక్షుడు సుందరి అనిల్, ఏపీసీఎస్ చైర్మన్ రామచంద్రారెడ్డి, సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకటేశ్ యాదవ్, వైస్ ఎంపీపీ నర్సింహులు, యూత్ అధ్యక్షుడు కొండల్‌రెడ్డి, గ్రామ కమిటీ అధ్యక్షుడు యాకుబ్, మాజీ ఎంపీటీసీ లక్ష్మణ్, సీనియర్ నాయకులు జయానంద్, మాజీ సర్పంచ్ రామ్ ప్రసాద్, నాయకులు బాలేశ్, మహబూబ్, హుస్సేన్, మొయినొద్దిన్, వీరేశం, శీను, బాబు నాయక్, రశీద్, అలీ, మజర్, వెంకటేశం, కృష్ణ కుమార్, శ్రీకాంత్ రెడ్డి, అనిల్, రవి తదితరులు పాల్గొన్నారు.