వికారాబాద్, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ): వికారాబాద్ జిల్లాలో గనుల నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రభుత్వం లీజు విధానంతో గనుల తవ్వకాలకు అనుమతులు ఇస్తున్నది. ఈ లీజు పద్ధతి వల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతున్నదని జిల్లాయంత్రాంగం భావించి ఈ-వేలం పద్ధతికి కసరత్తును పూర్తి చేసి, ప్రభుత్వానికి ప్రతిపాదనలను అందజేసింది. గనుల ఈ-వేలం విధానానికి మాత్రం ప్రభుత్వం నుంచి ఇంకా మోక్షం లభించలేదు. మైనింగ్ వ్యాపారులు లీజుకు తీసుకున్న భూములతోపాటు ప్రభుత్వ భూముల్లోనూ తవ్వకాలను జరుపుతూ సర్కారు ఖజానాకు గండికొడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో అనుమతులు లేకున్నా అక్రమంగా గనులను తవ్వుతుండడంతో సర్కారుకు రూ.కోట్లలో నష్టం వస్తున్నది. లీజు గడువు పూర్తైనవారు, కొత్త వ్యాపారుల నుంచి వెయ్యికిపైగా దరఖాస్తులు వచ్చినా ఈ-వేలం విధానం రానున్నదని రెండేండ్లుగా దరఖాస్తులను పెండింగ్లోనే ఉంచారు. జిల్లాలో పెద్ద, చిన్న తరహా గనుల లీజు వల్ల ఈ ఆర్థిక సంవత్సరం రూ.113 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేయగా, ఇప్పటివరకు ప్రభుత్వానికి రూ.74 కోట్లు ఆదాయం సమకూరింది.
గనులను ఈ-వేలం వేసే విధానానికి ఇంకా మోక్షం లభించలేదు. ప్రస్తుతం కొనసాగుతున్న లీజు విధానానికి స్వస్తి చెప్పి ఈ-వేలం విధానాన్ని తీసుకొచ్చేందుకు జిల్లా గనుల శాఖ అధికారులు కసరత్తు పూర్తి చేసినా ప్రభుత్వ నిర్ణయం మాత్రం పెండింగ్లోనే ఉన్నది. ఇప్పటికే రంగారెడ్డి, యాదాద్రి జిల్లా ల్లో పైలట్ ప్రాజెక్టుగా గనుల ఈ-వేలం విధానాన్ని అమలు చేస్తున్నారు. వికారాబాద్ జిల్లాలోనూ గనులున్న ప్రాంతాలకు సంబంధించిన డీజీపీఎస్ మ్యాపులను అధికారులు సిద్ధం చేయడంతోపాటు రెవెన్యూశాఖ నుంచి ఎన్వోసీలను కూడా సేకరించారు. లీజుకిచ్చే పద్ధతితో ప్రభుత్వానికి రూ.కోట్ల లో నష్టం వస్తున్నదని భావించిన అధికారులు ఈ-వేలం విధానంతో గనుల తవ్వకాలకు అనుమతు లు మంజూరు చేసేలా ప్రభుత్వానికి రెండు నెలల క్రితమే ప్రతిపాదనలు అందజేశారు.
అయితే ప్రభు త్వం నుంచి అనుమతులు రాకపోవడంతో ఇంకా గనుల తవ్వకాలు లీజు విధానంలోనే సాగుతుండడంతో ప్రభుత్వ ఖజానాకు భారీగా నష్టం చేకూరుతున్నది. మైనింగ్ వ్యాపారులు కేవలం పది ఎకరాలను లీజుకు తీసుకొని పక్కన ఉన్న ప్రభుత్వ భూ ముల్లోనూ అక్రమంగా మైనింగ్ తవ్వకాలు జరుపుతున్నారు. ఇలా వందల ఎకరాల్లో ఎలాంటి అనుమతుల్లేకుండానే అక్రమంగా గనుల తవ్వకాలకు పాల్పడుతున్నారు. అయితే గత రెండేండ్లుగా జిల్లావ్యాప్తంగా వెయ్యికిపైగా దరఖాస్తులు రాగా సంబంధిత దరఖాస్తులన్నీ పెండింగ్లోనే ఉన్నాయి. ఈ-వేలం విధానంతో నిర్ణీత సమయానికి నిక్షిప్తమైన గనుల తవ్వకాలకు మాత్రమే అనుమతులను మం జూరు చేస్తారు కాబట్టి పెండింగ్లోనే ఉంచారు. అయితే అటు లీజుకు తీసుకున్న మైనింగ్ వ్యాపారులు గడువు పూర్తైన తవ్వకాలు జరుపుతూ ప్రభుత్వానికి భారీగా నష్టాన్ని కలిగిస్తున్నారు.
కొనసాగుతున్న అక్రమ తవ్వకాలు..
జిల్లాలో జోరుగా అక్రమ గనుల తవ్వకాలు జరుగుతున్నాయి. తాండూరు నియోజకవర్గంలో నాపరాయి, సుద్ద గనులు, ఎర్రమట్టిని.. వికారాబాద్ నియోజకవర్గంలో ఎర్రమట్టి, కంకర గనులను అక్రమంగా తవ్వి తరలిస్తున్నారు. తాండూరు మండలంలోని మల్కాపూర్, కోటబాసుపల్లి, ఓగిపూర్ గ్రామాల్లో నాపరాతి నిక్షేపాలు విస్తరించి ఉన్నాయి. మల్కాపూర్, కోటబాసుపల్లి గ్రామాల పరిధిలో సు మారు 330 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. రెవె న్యూ, మైనింగ్ అధికారుల నిర్లక్ష్యంతో ఈ భూము ల్లో ఎక్కువగా అక్రమ దందా సాగుతున్నది. ఎవరైనా ఫిర్యాదు చేస్తే, తుతూమంత్రంగా అక్కడికెళ్లి చిన్న, చిన్న యంత్రాలను సీజ్ చేసి వస్తున్నారనే ఆరోపణలున్నాయి. కొంతమంది పట్టాభూముల్లో లీజు పొంది, పక్కనే ఉండే ప్రభుత్వ భూములను ఆక్రమించుకొని తవ్వకాలు జరుపుతున్నారు. అం తేకాకుండా చాలావరకు లీజు గడువు ముగిసినప్పటికీ అక్రమంగా నాపరాయితోపాటు గనుల తవ్వకాలు జరుపుతూ ఖజానాకు నష్టం చేస్తున్నారు.
రూ.74 కోట్ల ఆదాయం..
జిల్లాలో మైనింగ్ లీజులైన పెద్ద తరహా, చిన్న తర హా గనుల ద్వారా ఈ ఆర్థిక సంవత్సరం రూ.113 కోట్ల రెవెన్యూ వస్తుందని అంచనా వేయగా ఇప్పటివరకు రూ.74 కోట్ల ఆదాయం మాత్రమే ఖజా నాకు చేరింది. అయితే గతేడాది గనుల లీజుల ద్వారా రూ. 115.20 కోట్ల ఆదాయం రావడం గమనార్హం. అయితే ఈ-వేలం విధానాన్ని అమల్లోకి తీసుకొస్తే మరింత ఆదాయం సమకూరే అవకాశమున్నది. జిల్లాలోని పెద్దేముల్, మర్పల్లి, వికారాబాద్, పరిగి మండలాల్లో 610 హెక్టార్ల విస్తీర్ణంలో 40 ఎర్రమట్టి గనులున్నాయి. అదేవిధంగా తాండూరు మండలంలో 100 హెక్టార్ల విస్తీర్ణంలో 160 నాపరాయి గనులున్నాయి. పెద్దేముల్, మర్పల్లి, ధారూరు మండలాల్లో 41 హెక్టార్ల విస్తీర్ణంలో 65 సుద్దగనులు, వికారాబాద్, దోమ మండలాల్లో 86 హెక్టార్లలో 34 కంకర గనులున్నాయి. తాం డూరు మండలంలో 12 హెక్టార్లలో 6 గ్రానైట్ గనులతోపాటు దోమ మండలంలో 76 హెక్టార్లలో 6 పలుగురాళ్ల గనులున్నాయి.
ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉన్నది
గనుల ఈ-వేలం విధానానికి సంబంధించి జిల్లా యంత్రాంగం అవసరమైన కసరత్తు పూ ర్తి చేసి ప్రభుత్వానికి అందజేసింది. ప్రభుత్వం నుంచి నిర్ణయం రావాల్సి ఉన్నది. ఈ-వేలం విధానానికి సంబంధించి డీజీపీఎస్ మ్యాపులను సిద్ధం చేయడంతోపాటు రెవెన్యూ శాఖ నుంచి ఎన్వోసీలను కూడా సేకరించం. గను ల లీజు గడువు పూర్తైనప్పటికీ రెన్యువల్ చేసుకోకుండా అక్రమంగా గనులను తవ్వుతున్న ట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. త్వరలోనే తనిఖీలు నిర్వహించి, తగు చర్యలు తీసుకుంటాం.
– జాకబ్, వికారాబాద్ జిల్లా గనుల శాఖ అధికారి