వికారాబాద్, మే 15 : తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పోలీస్ వ్యవస్థ సామాజిక సమస్యలను పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నదని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు చేపట్టి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు
తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయం నుంచి పట్టణంలోని సత్యభారతి ఫంక్షన్‌హాల్ వరకు హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సత్యభారతి ఫంక్షన్హాల్లో రోడ్ సేఫ్టీ, హెల్మెట్ వాడకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నారాయణరెడ్డి మాట్లాడుతూ సురక్షితంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు. అతి వేగంవల్ల ప్రమాదాలు జరుగుతాయని..మద్యం తాగి వాహనాలను నడపొద్దని సూచించారు.
వాహనాలు నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాల న్నారు. అనంతరం ఎస్పీ కోటిరెడ్డి మాట్లాడుతూ మా నవ తప్పిదాలతోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగు తున్నాయన్నారు. రోడ్డు యాక్సిడెంట్లు ఎక్కువగా సా యంత్రం 6 నుంచి 9 గంటల మధ్యలో జరుగుతాయని దీనికి కారణం డ్రంక్ అండ్ డ్రైవ్ అని అన్నారు. జిల్లాలో ప్రమాదాలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. జిల్లాలో 70 శాతం మంది టూవీలర్లు హెల్మెట్ ఉన్నా వినియోగించుకోవడం లేదన్నా రు. జిల్లాలో 31 బ్లాక్స్పాట్లను గుర్తించామని.. ప్రమాదాలు జరుగకుండా ఇప్పటివరకు 176 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ మేఘన, ఆర్అండ్బీ డీఈ శ్రీధర్‌రెడ్డి, వికారాబాద్ డీఎస్పీ సత్యనారాయణ, పోలీస్ సిబ్బంది, మెడికల్ కళాశాల డాక్టర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.
2023-24 సంవత్సరం అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్‌లో శిక్షణ పొందేందుకు జిల్లాకు చెందిన బీసీ లా గ్రాడ్యుయేట్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. గుర్తింపు పొందిన విద్యాసంస్థల నుంచి లా కోర్సులో డిగ్రీ పొందిన వారు అర్హులన్నారు. అభ్య ర్థులు 23 నుంచి 35 ఏండ్లలోపు ఉండాలని.. వారి సంరక్షకుడి ఆదాయం గ్రామీణ ప్రాంతాల వారికి రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల వారికి రూ.2లక్షలకు మించరాదన్నారు. బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకొని ఉండాలన్నారు. ఎంపికైన అభ్యర్థులు మూ డేండ్లపాటు అడ్మినిస్ట్రేటివ్ ఆఫ్ జస్టిస్ శిక్షణ పొందాలని, శిక్షణ కాలంలో నెలకు రూ.వెయ్యి చొప్పున ైస్టెఫండ్ చెల్లిస్తామని తెలిపారు. న్యాయవాదిగా ఎన్రోల్మెంట్ ఫీజు రూ.585, లా పుస్తకాలు, ఫర్నిచర్ కొనుగోలుకు రూ.3 వేలు చెల్లించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలతో ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఇతర వివరాలకు బీసీ అభివృద్ధి శాఖ జిల్లా అధికారిని సంప్రదించాలన్నారు.
2023-24 సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ పాఠశాలల్లో 3, 5, 8వ తరగతుల్లో ప్రవేశాల కోసం గిరిజన బాల/బాలకలు దరఖాస్తు చేసుకోవాలలని కలెక్టర్ నారాయణరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొ న్నారు. ఖాళీలు 45 ఉన్నాయి. అభ్యర్థులు వికారాబా ద్ జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు. ఈ నెల 18 నుంచి జూన్ 2వరకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేస్తామన్నారు.