వికారాబాద్, మార్చి 22 : గ్రామాల్లో ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనుల్లో కూలీల సంఖ్యను పెంచుతూ పనులను పూర్తి చేయాలని వికారాబాద్ కలెక్టర్ నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. గురువారం టెలికాన్ఫరెన్స్ ద్వారా సంబంధిత అధికారులతో మాట్లాడారు. సీసీ రోడ్ల కు సంబంధించి, లేబర్ మొబిలైజేషన్ తక్కువ ఉన్న గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ పనులు మానిటరింగ్ చేసే ఒక వ్యక్తిని ప్రతి హ్యబిటేషన్ కు ఏర్పాటు చేసి పనులు చేయించాలన్నారు.
లేబర్ తక్కువ ఉన్న గ్రామాలపై దృష్టి పెట్టి గ్రూపులను ఏర్పాటు చేయాలన్నారు. లేబర్ సమావేశాలు నిర్వహించి, కూలీలను పెంచి పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల చివరి వరకు పూర్తైన వాటికి ఎఫ్‌టీవో జనరేట్ చేయాలన్నారు. టెలికాన్ఫరెన్స్ లో డీఆర్డీఏ శ్రీనివాసులు, జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, ఏపీవోలు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.