Vikarabad | వ్యాపారాలు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించాలి
Vikarabad | వ్యాపారాలు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు.
Vikarabad | వికారాబాద్, ఏప్రిల్ 30 : వ్యాపారాలు చేసేందుకు ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ సంబంధిత అధికారులకు సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ చాంబర్లో నూతన ప్రాథమిక వ్యవసాయ సంఘాలు, పిఎసిఎస్ కంప్యూటరైజేషన్, నూతన పెట్రోల్ పంపులు, ఎల్పిజి, మత్స్య సంఘాలు, డెయిరీ ఫాంలు, గోదాములు, ఏర్పాటు తదితర అంశాలపై జిల్లా సహకార అధికారులు, వివిధ బ్యాంకుల అధికారులతో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) సుధీర్‌తో కలిసి అదనపు కలెక్టర్ (రెవెన్యూ) సమీక్షించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ మాట్లాడుతూ.. సహకార రంగాన్ని బలోపేతం చేసేందుకు వివిధ రంగాల్లో ప్రోత్సహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో రైతుల అవసరాలకు అనుగుణంగా అదనంగా ప్రాథమిక వ్యవసాయ సంఘాలను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదన ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. కొత్త పెట్రోల్ పంపులు, ఇప్పటికే ఉన్న పెట్రోల్ పంపుల మార్పిడిపై దృష్టి సారించాలన్నారు. జన ఔషధి కేంద్రాలు, కిసాన్ సమృద్ధి కేంద్రాల ఏర్పాటుకు కృషి చేయాలని సూచించారు. నేషనల్ కోఆపరేటివ్ ఎక్స్పోర్ట్ లిమిటెడ్, నేషనల్ కోఆపరేటివ్ ఆర్గానిక్స్ లిమిటెడ్, భారతీయ బీజ్ సహకార్ సమితి లిమిటెడ్‌లు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు.
ఈ సమీక్ష సమావేశంలో జిల్లా సహకార అధికారి నాగార్జున, నాబార్డ్ డిడిఎం అఖిల్ పున్న, జిల్లా సెంట్రల్ బ్యాంక్ సిఈవో సుబ్రమణ్యం, జిల్లా పశు సంవర్దక అధికారి సదానందం, వ్యవసాయ అధికారి పద్మావతి, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | సిరిసిల్ల జేఎన్టీయూ విద్యార్థుల సమస్యలపై రేవంత్ రెడ్డికి కేటీఆర్ విజ్ఞప్తి
Shoulder Press Exercise | షోల్డర్ ప్రెస్ వ్యాయామం అంటే ఏమిటి.. దీంతో కలిగే లాభాలేమిటి.. ఎలా చేయాలి..
Kangana Ranaut | దైవ సంకల్పం ఉంటేనే సాధ్యమవుతుంది.. అయోధ్య సందర్శనలో కంగనారనౌత్
Gautam Gambhir | ఈ రాత్రికి వెస్టిండీస్‌తో మూడో టీ20.. మహాకాళేశ్వరుడిని దర్శించుకున్న కోచ్ గంభీర్..!
Revanth Reddy Delhi Tour | ఆగమేఘాల మీద ఢిల్లీకి రేవంత్ రెడ్డి.. హస్తిన పర్యటన వెనుక ఆంతర్యమేంటి?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

