అంటువ్యాధులు సోకకుండా, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా చిన్నారులకు పీసీవీ టీకా వేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఈ టీకా పిల్లల్లో న్యూమోనియా, మెనింజైటిస్ వంటి వ్యాధులు సోకకుండా కట్టడి చేయనున్నది. రేపటి నుంచి ఉచితంగా టీకా పంపిణీని ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం చేస్తున్నది. ఇప్పటికే ప్రైవేటు దవాఖానల్లో డబ్బులు తీసుకుని టీకా వేస్తుండగా, ఇక నుంచి సర్కారు దవాఖానల్లో శిశువు పుట్టిన ఆరు వారాలకు మొదటి డోస్, 14 వారాలకు రెండోది, తొమ్మిది నెలలకు మూడో డోస్‌ను (బూస్టర్ డోస్) ఫ్రీగా వేయనున్నారు. అంతేకాకుండా ఐదేండ్లలోపు చిన్నారులందరికీ పీసీవీ టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం చేయనున్నారు.
వికారాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ): జిల్లాలోని ఐదేండ్లలోపు పిల్లలకు పీసీవీ (న్యు మోకోనికల్ కాంజుగేట్ వ్యాక్సిన్) టీకా వేసే ప్రక్రియను ఈనెల 12 నుంచి ప్రారంభించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటి వరకు ప్రైవేట్ కేంద్రల్లోనే వ్యాక్సిన్ ఇస్తుండగా.. తాజాగా ప్రభుత్వ దవాఖానలు, అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వైద్య శాఖకు 300 వాయిల్ వచ్చాయి. 0-5 ఏండ్లు, పుట్టిన ఆరు వారాలకు మొదటి, 14 వారాలకు రెండోది, తొమ్మిది నెలలకు మూడోది (బూస్టర్ డోస్) వేయించాల్సి ఉంటుంది.
న్యు మోకోకల్ అనేది స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల సమూహం. ఐదేండ్ల లోపు చిన్నారుల్లో వచ్చే న్యుమోనియాకు బ్యాక్టీరియానే ప్రధాన కారణం. వీటిని అధిగమించేందుకు పీసీవీ టీకా వినియోగిస్తారు. పిల్లల్లో అంటువ్యాధులు సోకకుండా, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా వైద్యులు ఈ టీకా వేస్తారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఈ టీకాను ఉచితంగా ఇస్తున్నారు. ఈ నెల 12న రాష్ట్రంలో ప్రారంభించనున్నారు. దీంతో పాటు వికారాబాద్ జిల్లాలో గురువారం లేదా శనివారం పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. పిల్లల్లో న్యూమోనియా, మెనింజైటిస్ వంటి వ్యాధులు వ్యాపించకుండా టీకా కట్టడి చేయనున్నది. వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం 0 నుంచి 5 ఏండ్లలోపు పిల్లలు 40 వేల మందికి పైగా ఉన్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
వయస్సు: 0-5 ఏండ్లు. పుట్టిన ఆరు వారాలకు మొదటి, 14 వారాలకు రెండోది. తొమ్మిది నెలకు మూడోది(బూస్టర్ డోస్) వేయించాలి. ఆల్యమైతే పుట్టిన రోజుకు ముందు కనీసం ఒక మోతాదు పీసీవీని వేసి ఉంటే మిగతా వాటిని ఇవ్వొచ్చు.
*మొదటి సంవత్సరంలోనే ఆలస్యమైతే (2 ప్రాథమిక, బూస్టర్) కనిష్టంగా ఎనిమిది వారాల విరామంతో వేరు చేసి తదుపరి డోసు షెడ్యూల్ ఇమ్యూనైజేషన్ సందర్శనలో ఇవ్వాల్సి ఉంటుంది. కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విసృత్త ప్రచారం చేపట్టనున్నారు.
టీకాల ప్రక్రియ విజయవంతం చేసేందుకు, ఈ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతో పాటు డీఆర్డీఏ, డీపీవో, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, మెప్మా, మున్సిపల్ శాఖలతో పాటు అన్ని సంక్షేమ శాఖలు తమ తమ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ వ్యాక్సిన్ పిల్లలకు తగిన మోతాదులో ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పౌసుమి బసు వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశించారు. ఈ వ్యాక్సిన్ చాలా ఖరీదైనది. దీన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వేయనున్నారు. ఇప్పటికే దీనిపై జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించింది. ప్రధాన ప్రాంతాలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద పీసీవీ టీకా ఆవశ్యకతపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు ప్రచారం చేపట్టాలని వైద్య శాఖ అధికారులు నిర్ణయించారు.వికారాబాద్, ఆగస్టు 10, (నమస్తే తెలంగాణ): జిల్లాలోని ఐదేండ్లలోపు పిల్లలకు పీసీవీ (న్యు మోకోనికల్ కాంజుగేట్ వ్యాక్సిన్) టీకా వేసే ప్రక్రియను ఈనెల 12 నుంచి ప్రారంభించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటి వరకు ప్రైవేట్ కేంద్రల్లోనే వ్యాక్సిన్ ఇస్తుండగా.. తాజాగా ప్రభుత్వ దవాఖానలు, అంగన్వాడీ కేంద్రాల్లోనూ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా వైద్య శాఖకు 300 వాయిల్ వచ్చాయి. 0-5 ఏండ్లు, పుట్టిన ఆరు వారాలకు మొదటి, 14 వారాలకు రెండోది, తొమ్మిది నెలలకు మూడోది (బూస్టర్ డోస్) వేయించాల్సి ఉంటుంది.
న్యు మోకోకల్ అనేది స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా అనే బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల సమూహం. ఐదేండ్ల లోపు చిన్నారుల్లో వచ్చే న్యుమోనియాకు బ్యాక్టీరియానే ప్రధాన కారణం. వీటిని అధిగమించేందుకు పీసీవీ టీకా వినియోగిస్తారు. పిల్లల్లో అంటువ్యాధులు సోకకుండా, ఊపిరితిత్తుల సమస్యలు తలెత్తకుండా వైద్యులు ఈ టీకా వేస్తారు. ఇప్పటికే దేశంలోని వివిధ రాష్ర్టాల్లో ఈ టీకాను ఉచితంగా ఇస్తున్నారు. ఈ నెల 12న రాష్ట్రంలో ప్రారంభించనున్నారు. దీంతో పాటు వికారాబాద్ జిల్లాలో గురువారం లేదా శనివారం పంపిణీ చేపట్టాలని నిర్ణయించారు. పిల్లల్లో న్యూమోనియా, మెనింజైటిస్ వంటి వ్యాధులు వ్యాపించకుండా టీకా కట్టడి చేయనున్నది. వికారాబాద్ జిల్లాలో ప్రస్తుతం 0 నుంచి 5 ఏండ్లలోపు పిల్లలు 40 వేల మందికి పైగా ఉన్నట్లు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ లెక్కలు చెబుతున్నాయి.
వయస్సు: 0-5 ఏండ్లు. పుట్టిన ఆరు వారాలకు మొదటి, 14 వారాలకు రెండోది. తొమ్మిది నెలకు మూడోది(బూస్టర్ డోస్) వేయించాలి. ఆల్యమైతే పుట్టిన రోజుకు ముందు కనీసం ఒక మోతాదు పీసీవీని వేసి ఉంటే మిగతా వాటిని ఇవ్వొచ్చు.
*మొదటి సంవత్సరంలోనే ఆలస్యమైతే (2 ప్రాథమిక, బూస్టర్) కనిష్టంగా ఎనిమిది వారాల విరామంతో వేరు చేసి తదుపరి డోసు షెడ్యూల్ ఇమ్యూనైజేషన్ సందర్శనలో ఇవ్వాల్సి ఉంటుంది. కార్యక్రమంపై వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విసృత్త ప్రచారం చేపట్టనున్నారు.
టీకాల ప్రక్రియ విజయవంతం చేసేందుకు, ఈ వ్యాక్సిన్‌పై అవగాహన కల్పించేందుకు అంగన్వాడీ, ఆశా కార్యకర్తలతో పాటు డీఆర్డీఏ, డీపీవో, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, మెప్మా, మున్సిపల్ శాఖలతో పాటు అన్ని సంక్షేమ శాఖలు తమ తమ పరిధిలో ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఈ వ్యాక్సిన్ పిల్లలకు తగిన మోతాదులో ఇచ్చేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ పౌసుమి బసు వైద్య ఆరోగ్య శాఖకు ఆదేశించారు. ఈ వ్యాక్సిన్ చాలా ఖరీదైనది. దీన్ని ప్రభుత్వ దవాఖానల్లో ఉచితంగా వేయనున్నారు. ఇప్పటికే దీనిపై జిల్లా టాస్క్‌ఫోర్స్ కమిటీ సమావేశం నిర్వహించింది. ప్రధాన ప్రాంతాలు, అంగన్వాడీ కేంద్రాల వద్ద పీసీవీ టీకా ఆవశ్యకతపై అవగాహన బోర్డులు ఏర్పాటు చేయనున్నారు. ఐఎంఏ ఆధ్వర్యంలో వైద్యులు ప్రచారం చేపట్టాలని వైద్య శాఖ అధికారులు నిర్ణయించారు.
చిన్న పిల్లలకు సంక్రమించే తీవ్రమైన శ్వాస కోశ వ్యాధి నిమోనియా నుంచి రక్షణ కోసం ప్రతిఒక్కరూ నిర్భయంగా న్యుమోకొకల్ కాంజూ గేట్ వ్యాక్సిన్‌ను మూడు మోతాదుల్లో వేయించాలి. దీంతో ప్రాణాపాయం ఉండదు. చిన్నారులకు 6 వారాలు, 14 వారాలు, 9 నెలలకు మూడు మోతాదులో వేయించాలి.
పిల్లల్లో వ్యాధులు సోకకుండా సకాలంలో టీకాలు తీసుకోవాలి. ఈనెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నది. జిల్లాలో గురువారం లేదా శనివారం మొదలు పెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. పీసీవీ టీకా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐదేండ్లలోపు పిల్లలందరికీ మూడు డోసుల చొప్పున వేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ ఆదేశాలు రాగానే జిల్లాలో ప్రారంభిస్తాం. జిల్లాకు 300 వాయిల్స్ వచ్చాయి.