
పరిగి, జూలై 5 : పరిగి పట్టణాన్ని సుందరంగా మారుద్దామని ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ ప్రగతిలో భాగంగా పరిగిలోని 3, 5, 7, 8 వార్డుల్లో ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా వార్డుల్లో నెలకొన్న సమస్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే ప్రతి వార్డులో రూ.10లక్షలకు సంబంధించిన పనులు ప్రారంభం కానున్నాయని తెలిపారు. 5వ వార్డు పరిధిలోని కొత్త కాలనీలలో మురుగుకాలువల నిర్మాణానికి రూ.50లక్షలు కేటాయిస్తామన్నారు. కొత్త కాలనీలలో యుద్ద ప్రాతిపదికన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ట్రాన్స్‌కో ఏఈకి ఎమ్మెల్యే సూచించారు. ఆయా కాలనీలలో పాడుబడిన, శిథిలావస్థకు చేరిన పాత ఇండ్లను తొలగించాల్సిందిగా మున్సిపల్ కమిషనర్‌ను ఎమ్మెల్యే ఆదేశించారు. ప్రతి వార్డులో ఇళ్లపై నుంచి కరెంటు తీగలు ఉన్న ప్రాంతాలను గుర్తించాల్సిందిగా చెప్పారు. పార్కుల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఏర్పాటు చేయాలని, మరింత సుందరంగా తీర్చిదిద్దాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయా కాలనీల్లో మహిళలకు మొక్కలు అందజేయడంతోపాటు బోయవాడ, అయ్యప్పకాలనీల్లో ఎమ్మెల్యే మొక్కలు నాటారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, వైస్ చైర్పర్సన్ కె.ప్రసన్నలక్ష్మి, మాజీ ఎంపీపీ కె.శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు బి.ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు వెంకటేశ్, రాములమ్మ, నాయకులు రవికుమార్, మల్లేశ్, ఆసిఫ్ పాల్గొన్నారు.
పెద్దేముల్ మండలంలో..
పెద్దేముల్, జూలై 5 : మండల పరిధిలోని గ్రామాల్లో వివిధ రకాల మొక్కలు నాటారు. గ్రామ పంచాయతీల్లో ఇండ్ల వద్ద మొక్కలు నాటడానికి గ్రామస్తులకు మొక్కలను పంపిణీ చేశారు. తాండూరు-సంగారెడ్డి ప్రధాన రోడ్డు మార్గంలో ఇరువైపులా మొక్కలను నాటి వాటికి రక్షణగా ట్రీగార్డులను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
చీలాపూర్‌లో పారిశుధ్య పనులు
పూడూరు, జూలై 5 : మండల పరిధిలోని చీలాపూర్, అంగడి చిట్టంపల్లి, కడ్మూర్, మేడికొండ, పెద్ద ఉమ్మెంతాల్ గ్రామాల సర్పంచ్ల ఆధ్వర్యంలో పల్లె ప్రగతి పనులు నిర్వహిస్తున్నారు. పల్లెల్లో పరిశుభ్రత కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారు.
బషీరాబాద్ మండలంలో..
బషీరాబాద్, జూలై 5 : పల్లె ప్రగతిలో భాగంగా మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో ఎంపీపీ కరుణ, జడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ, టీఆర్ఎస్ నాయకులు, అధికారులతో కలిసి మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు ప్రియాంక, నవనీత, సునీత, అనురాధ, సీమాసుల్తానా, నారాయణ, ఎంపీటీసీలు శ్రీనివాస్, శ్రీధర్, సురేశ్, పీఏసీఎస్ డైరెక్టర్ అజయ్‌ప్రసాద్, నాయకులు అనంతయ్య, ఎంపీడీవో రమేశ్, ఏపీవో శారధ, టీఏ నర్సిహారెడ్డి, ఉపాధిహామీ సిబ్బంది పాల్గొన్నారు.