కులకచర్ల, అక్టోబర్ 4 : చౌడాపూర్ మండల పరిధిలోని మక్తవెంకటాపూర్ గ్రామంలో జడ్పీటీసీ రాందాస్‌నాయక్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ శారదమ్మ, టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి నర్సింహా ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. కులకచర్ల మండల పరిధిలోని చాపలగూడెం గ్రామంలో సర్సంచ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ కులకచర్ల మండల అధ్యక్షుడు శేరిరాంరెడ్డి, రైతుబంధు సమితి అధ్యక్షుడు రాజు, టీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, మాలెకృష్ణయ్యగౌడ్, రాజయ్య, రాములు, టీఆర్ఎస్ గ్రామ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
చిన్ననందిగామ గ్రామంలో..
కొడంగల్, అక్టోబర్ 4: మున్సిపల్ పరిధిలోని 2, 3 రేషన్ షాపులు, మండలంలోని చిన్ననందిగామ గ్రామంలో మహిళలకు బతుకమ్మ చీరలను డిప్యూటీ తాసిల్దార్ ఆనంద్ అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఉషారాణి, మున్సిపల్ కమిషనర్ నాగరాజు, చిన్ననందిగామ సర్పంచ్ సావిత్రమ్మసాయి, మాజీ సర్పంచ్ రమేశ్‌బాబుతో పాటు డీలర్లు ఫాతిమాబేగం, పూరి చంద్రశేఖర్, టీఆర్ఎస్ మున్సిపల్ అధికార ప్రతినిధి డా.నవాజుద్దీన్, పీఏసీఎస్ డైరెక్టర్ చిదిరి వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
కోటబాసుపల్లి, మల్కాపూర్ గ్రామాల్లో..
తాండూరు రూరల్, అక్టోబరు 4 : తాండూరు మండల పరిధిలోని కోటబాసుపల్లి సర్పంచ్ నాగార్జున, మల్కాపూర్ సర్పంచ్ విజయలక్ష్మిపండరి ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల ఆవరణలో మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వీరేందర్‌రెడ్డి, వెంకట్రాంరెడ్డి, ఎంపీటీసీ సభ్యురాలు రవిసింధే, పండరి, కో ఆప్షన్ సభ్యులు శంశోద్దీన్, ఉప సర్పంచ్ హసన్‌పటేల్ పాల్గొన్నారు.
బస్వపూర్‌లో..
బంట్వారం, అక్టోబర్ 4: మండల పరిధిలోని బస్వపూర్‌లో బతుకమ్మ చీరలను సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు నర్సింహులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీపీ ప్రభాకర్, పీఏసీఎస్ మాజీ వైస్ చైర్మన్ బల్వంత్‌రెడ్డి, ఎస్ఎంసీ చైర్మన్ శివరాజ్, పంచాయతీ వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కోట్‌పల్లి, అక్టోబర్ 4: మండలంలోని కరీంపూర్ గ్రామంలో టీఆర్ఎస్ నాయకుడు సుందరి అనిల్‌కుమార్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను తాసిల్దార్ అశ్పక్స్రూల్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్యదర్శి సుభాశ్ పాల్గొన్నారు.
బూర్గుపల్లి, శివరాంనగర్ కాలనీల్లో..
వికారాబాద్, అక్టోబర్ 4 : వికారాబాద్ పట్టణంలోని బూర్గుపల్లి, శివరాంనగర్ తదితర కాలనీల్లో ప్రజాప్రతినిధులు మహిళలకు బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ శంషాద్‌బేగం, కౌన్సిలర్ నవీన్‌కుమార్, మాజీ జడ్పీటీసీ ముత్తహర్‌షరీఫ్, టీఆర్ఎస్ నాయకులు, కాలనీ వాసులు పాల్గొన్నారు.
దోమ మండల పరిధిలో..
దోమ, అక్టోబర్ 4 : మండల పరిధిలోని ఊటుపల్లి, తిమ్మాయిపల్లి, రాకొండ, పోతిరెడ్డిపల్లి, లింగన్‌పల్లి, పాలేపల్లి, అయినాపూర్, మోత్కూర్, మైలారం, ఖమ్మంనాచారం, దోర్నాల్‌పల్లి, దొంగఎన్కెపల్లి, గూడూరు, శివారెడ్డిపల్లి గ్రామాల్లో ఎంపీపీ అనసూయతో కలిసి జడ్పీటీసీ నాగిరెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ మల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, కోఆప్షన్ ఖాజాపాషా, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గోపాల్‌గౌడ్, పార్టీ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి, యూత్ అధ్యక్షుడు ముచ్చెందర్రెడ్డి, నాయకుడు రాఘవేందర్‌రెడ్డి, డిప్యూటీ తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
దౌల్తాబాద్..
దౌల్తాబాద్, అక్టోబర్ 4: మండలంలోని గోకఫస్లవాద్, తిమ్మారెడ్డిపల్లి, సుల్తాన్పూర్, నాగసాగర్, దేవర్‌ఫస్లవాద్, లొట్టికుంట తండా తదితర గ్రామాల్లో జడ్పీటీసీ కోట్ల మహిపాల్, ఎంపీపీ విజయ్‌కుమార్, మార్కెట్‌కమిటీ వైస్ చైర్మన్ భీములు ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్ సభ్యుడు జాకీర్‌అలీ, సర్పంచులు, ఎంపీటీసీ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.