Dairy Farm | షాబాద్, ఫిబ్రవరి 21 : గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు పాడి పరిశ్రమపై దృష్టి సారిస్తే మంచి లాభాలు సాధించవచ్చని రేగడిదోస్వాడ పశువైద్యాధికారి డాక్టర్ చంద్రశేఖర్రెడ్డి అన్నారు. శుక్రవారం షాబాద్ మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో పశువైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో పశువులకు వివిధ రకాల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు నిర్వహించి మందులు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశువులకు వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పాడి పరిశ్రమను పోషించుకుని జీవనం సాగించే రైతులకు మంచి ఆదాయం ఉంటుందని తెలిపారు. పశుసంవర్దకశాఖ ఆధ్వర్యంలో అన్ని గ్రామాల్లో వైద్యశిబిరాలు ఏర్పాటు చేసి పశువులకు వైద్యపరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ఆశోక్, వైద్యసిబ్బంది కృష్ణయ్య, శ్రీనివాస్, సాగర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.