కడ్తాల్, జూన్ 2 : నియోజకవర్గంలోని పేద ప్రజలను ఉప్పల, గంప లక్ష్మయ్య చారిటబుల్ ట్రస్ట్ తరఫున అన్ని విధాల ఆదుకుంటామని ట్రస్ట్ అధినేత, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్గుప్తా అన్నారు. సోమవారం మండల కేంద్రానికి చెందిన ముసిలి నర్సింహా ఇంటి నిర్మాణానికి ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తరుపున రూ.10 వేలు, గంప లక్ష్మయ్య ట్రస్ట్ తరుపున రూ.5 వేలను స్థానిక నాయకులతో కలిసి ఆయన ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని తెలిపారు.
నియోజకవర్గంలో ట్రస్ట్ తరఫున పేదల ఇండ్ల నిర్మాణానికి చేయూత, విద్యార్థుల ఉన్నత చదువులకు సహకారం, క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పరమేశ్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్షీనర్సింహారెడ్డి, పీఏసీఎస్ డైరెక్టర్ వీరయ్య, మాజీ ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, గోపాల్, చంద్రమౌళి, రమేశ్, మాజీ సర్పంచ్లు రవీందర్రెడ్డి, జంగయ్య, యాదయ్య, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ లాయక్అలీ, బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు కృష్ణ, నాయకులు రమేశ్, సురేశ్, మహేశ్, వెంకటేశ్, దాసు, యాదయ్య తదితరులు పాల్గొన్నారు.