ఆదిబట్ల సర్కిల్ తొర్రూర్ డివిజన్ పరిధి కొహెడలో ఎగుమతి-దిగుమతి ఆధారిత హోల్సేల్ చేపల మార్కెట్ శంకుస్థాపనకు వచ్చిన మంత్రి వాకిటి శ్రీహరికి శుక్రవారం మత్స్యకారుల నుంచి నిరసన సెగ తగిలింది. శంకుస్థాపన సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి ప్రసంగం మొదలు పెట్టగానే మత్స్యకారులు ప్లకార్డులు పట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సభ వేదిక వద్దకు వస్తుండగా పోలీసులు వారిని అరెస్టు చేసి ఠాణాకు తరలించారు. గతేడాది బడ్జెట్లో చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వం రూ. 123 కోట్లను కేటాయించినా పూర్తి స్థాయిలో వినియోగించకపోవడంతో రాష్ట్రంలో 30 శాతం మాత్రమే చేప పిల్లలను పంపిణీ చేశారని.. అవి కూడా నాణ్యతగా లేకపోవడంతో తీవ్ర నష్టాలను చవిచూడాల్సి వచ్చిందన్నారు.
అందుకోసం ప్రభుత్వం నేరుగా మత్స్యకారుల సొసైటీ ఖాతాల్లో రొయ్యలు, చేప పిల్లల కోసం నగదును జమ చేస్తే నాణ్యమైన చేప పిల్లలను కొంటామన్నారు. అలాగే, ప్రతి మత్స్యకార సొసైటీలో టూ వీలర్, ఫోర్ వీలర్ వెహికిల్స్ కొనేందుకు సబ్సిడీ ఇవ్వాలని.. పెండింగ్లో ఉన్న మృతి చెందిన మత్స్యకారుల ఎక్స్గ్రేషియాను వెంటనే విడుదల చేయాలని.. మత్స్యకారుల ఇన్సూరెన్స్ కోసం ప్రభుత్వం ప్రీమియాన్ని వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు.
-తుర్కయాంజాల్, జూలై 10
