కడ్తాల్, జూలై 19 : రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల పరిధిలోని కోరికతండాలో నిరుపేద కుటుంబానికి చెందిన ఇస్లావత్ రూప్సింగ్ ఇంటి నిర్మాణానికి మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ చేయూతనందించారు. శనివారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తరపున రూప్సింగ్ ఇంటి నిర్మాణానికి సిమెంట్, సామగ్రిని అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేద ప్రజలను అన్ని విధాల ఆదుకోవడమే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ధ్యేయమని తెలిపారు. పేదల ఇండ్ల నిర్మాణంతోపాటు, విద్యార్థుల ఉన్నత చదువులకు ట్రస్ట్ తరుపున సహరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ రవి, నాయకులు రవీందర్, నరేశ్, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.