కడ్తాల్, నవంబర్ 2 : రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన ఎల్లయ్య ఇంటి నిర్మాణానికి మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్ చేయూతనందించారు. ఆదివారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎల్లయ్య ఇంటి నిర్మాణానికి సిమెంట్‌తో పాటు ఇతర సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని పేదలను ఆదుకోవడమే ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని తెలిపారు.
గూడు లేని నిరుపేదలకు చెందిన ఇండ్ల నిర్మాణానికి ట్రస్ట్ తరపున ఆదుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లలిత, పీఏసీఎస్ డైరెక్టర్లు యాదయ్య, శేఖర్, మండల పరిషత్ మాజీ కోఆప్షన్ సభ్యుడు ఇమ్రాన్, నాయకులు ఈశ్వర్, దశరథం, రవి, వెంకటేశ్ పాల్గొన్నారు.