Uppal | ఉప్పల్, మార్చి 5 : చెరువులను సుందరీకరించి, అభివృద్ధి చేస్తున్నామని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి అన్నారు. దోమల నివారణకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు. చిలుకానగర్ డివిజన్లోని హైకోర్టు కాలనీలో దోమల నివారణకు ఆయిల్ బాల్స్ వేసే కార్యక్రమాన్ని బుధవారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, కార్పోరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనులు చేపడుతున్నామని చెప్పారు. కాలనీ వాసులకు ఇబ్బందులు లేకుండా తగిన చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో నిధుల కొరత లేకుండా పోరాటం చేస్తామని తెలియజేశారు. డివిజన్ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నానని చిలుకానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సమస్యల తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టేలా చూడాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్, ఏదుల కొండల్ రెడ్డి, కోకొండ జగన్, విబి నరసింహ, మాస శేఖర్, చేర్యాల శ్రీనివాస్, అల్లిబిల్లి మహేందర్, ఫోటో బాలు, షహనాజ్, సత్యవతి, శారద, మహమ్మద్, ఎండి షఫీ, సుందర్, బాలేందర్, నర్సింగ్ నేత, జిల్లెల ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.