చేవెళ్ల రూరల్, ఏప్రిల్ 28 : మండల పరిధిలోని గ్రామాల్లో వేసవిలో కరెంటు కష్టాలు కనిపిస్తున్నాయి. చాలా గ్రామాల్లో రోజుకు 10 నుంచి 20సార్లు కరెంటు పోయి.. రావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండలు మండిపోతున్నాయి. మరో వై పు అప్రకటిత విద్యుత్ కోతలతో ఉక్కబోతతో ఇబ్బందులు పడుతున్నారు. పలు చోట్ల ముం దుగానే ప్రకటించి కోతలు విధిస్తున్నారు. ఇదేమంటే మరమ్మతుల పేరు చెబుతున్నారు.
రోజు రోజుకీ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో కూలర్లు, ఫ్యాన్ల వినియోగం కూడా పెరిగింది. తద్వారా ఫీడర్లపై లోడు పెరగడంతోనే కరెంటు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అనధికారికంగా సిబ్బంది పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో కి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ప్రజలకు పూ ర్తి స్థాయిలో మౌలిక వసతులు కల్పించడంలో విఫలమైందని పలువురు వినియోగదారులు పేర్కొంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హ యాంలో రెప్పపాటున కూడా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండేది కాదు.
వర్షాకా లం, గాలిదుమారాలకు సైతం ముందస్తు ప్ర ణాళికలు ఉండేవి. ప్రస్తుతం అవేమి పట్టనట్లు అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్నారు. చిన్నపాటి వర్షాలు, గాలి దుమారం ఏర్పడినప్పుడు మరమ్మతుల పేరుతో గంటల కొద్దీ సరఫరాలో అంతరాయం ఏర్పడుతున్నది. చేవెళ్ల మండల పరిధిలోని గ్రామాలకు చేవెళ్ల 33/11 కేవీ విద్యుత్ ఉప కేంద్రం, ఇబ్రహీంబాగ్ డివిజన్‌కు సంబంధించిన మొయిన్ లైన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతుంది. చిన్నపా టి వర్షాలు..
గాలి దుమారాలకు సైతం తర చూ అంతరాయం ఏర్పడుతున్నది. కొన్ని సా ర్లు రాత్రులంతా నిద్ర లేకుండా గడుపుతున్నామని, అధికారులకు ముందస్తు ప్రణాళికలు లేకపోవడం, ప్రభుత్వం పట్టించుకోకపోవడం తో సమస్య మరింత జఠిలం కావడానికి ప్రధాన కారణంగా తెలుస్తున్నది. సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
రోజులో 10 నుంచి 20 సార్లు అంతరాయం
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి అధికంగా విద్యుత్ కోతలు ఏర్పడుతున్నవి. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రెప్పపాటు అంతరాయం ఏర్పడేది కాదు. అసలు ఈ ప్రభుత్వానికి ఏమైంది. రోజులో 10 నుంచి 20 సార్లు కరెంట్ పోతది.. వస్తది. ఇదేంటని అధికారులను అడిగితే పెద్ద లైన్ సమస్య ఉంది.. ఆ సమస్య ఉంది.. ఈ సమస్య ఉంది అని మేనేజ్ చేస్తున్నారు. చాలా ఇబ్బందులు పడుతున్నాం.
– కొల్లగల్ల భాస్కర్, ఈర్లపల్లి, చేవెళ్ల మండలం
ఎప్పుడు పోతదో.. ఎప్పుడు వస్తదో..
రోజులో పూర్తిగా విద్యుత్ అంతరాయం లేని రోజు అంటూ లేదు. ఎప్పుడు పోతదో.. ఎప్పుడు వస్తదో తెలియదు. కరెంట్ లేకపోతే ఏ పని చేయలేని పరిస్థితి. ప్రభుత్వం మస్తు ఇబ్బంది పెడుతుంది. కేసీఆర్ హయాంలో ఇట్ల ఉండేది కాదు. మా ఖర్మ.. ఇక ఓట్లేసినం తప్పదు అనుకుంటున్నాం.
– కె.కరుణాకర్, ఈర్లపల్లి, చేవెళ్ల మండలం