కొత్తూరు, జూలై 11 : వేగంగా వెళుతున్న రైలు నుంచి జారిపడి ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు పోలీస్టేసన్ పరిధిలోని షాద్‌నగర్, తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ల మధ్య జరిగింది. రైల్వే కానిస్టేబుల్ మల్లేశ్వర్ వివరాల ప్రకారం.. 25 నుచి 30 ఏండ్ల వయసు ఉన్న వ్యక్తి కొత్తూరు రైల్వే స్టేషన్ సమీపలంలో రైలు నుంచి జారి పడి మృతి చెందాడు. అతని వద్ద అప్జల్‌గంజ్ నుంచి జేపీ దర్గా బస్ టికెట్ లభించింది. మృతుడు నల్లటి గడ్డం, నల్లని రెయిన్ కోటు, గ్రీన్ కలర్ టీషర్టు, బ్రౌన్ కలర్ జీన్స్ ప్యాంటు, ప్యారగాన్ చెప్పులు ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ ప్రభుత్వ దవాఖనకు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని రైల్వే పోలీసులు తెలిపారు.