కొండాపూర్, మార్చి 24 : గుర్తు తెలియని వ్యక్తి మృత దేహం లభ్యమైన సంఘటన చందా నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..లింగంపల్లి రైల్వే స్టేషన్ 6వ ఫ్లాట్ ఫారం సమీపంలోని ఫూట్ పాత్ పై గుర్తు తెలియని వ్యక్తి (65), మృతి చెందినట్లు అందిన సమాచారంతో ఘటన ప్రదేశానికి చేరుకుని పరిశీలించారు.
సదరు వ్యక్తికి సంబంధించిన ఎలాంటి వివరాలు లభించలేదని, స్థానికులు తెలిపిన సమాచారం ప్రకారం యాచకుడిగా భావిస్తున్నారు. సరైన ఆహారం లేకపోవడం, వృద్ధాప్యం కారణంగా మృతి చెందినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని ప్రభుత్వ దవాఖానకు తరలించి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు.