షాద్‌నగర్‌రూరల్, సెప్టెంబర్ 29 : రైతుల సంక్షేమం కోసం తెలంగాణ సర్కార్ అహర్నిశలు కృషి చేస్తుందని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. ఫరూఖ్‌నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామశివారులో రూ.1.33 కోట్లతో 1000 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో నూతనంగా నిర్మించిన రెండు గిడ్డంగులను శుక్రవారం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, రాష్ట్ర వ్యవసాయ సహకార యూనియన్ చైర్మన్ రాజవరప్రసాద్, పీఎస్సీఎస్ షాద్‌నగర్ చైర్మన్ బక్కన్నయాదవ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి రైతును ధనవంతుడిగా మార్చడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వివిధ రైతు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, 24గంటల విద్యుత్, సబ్సిడీపై పనిముట్లు, సకాలంలో విత్తనాలు, గిట్టుబాటు ధరను చెల్లిస్తూ ధాన్యం కొనుగోలు, నిల్వ చేసేందుకు గిడ్డంగులు, రైతుల సమస్యల పరిష్కారానికి రైతు వేదికలు, ఆర్థిక ఇబ్బందులను తొలగించేందుకు రుణమాఫీ ఇలా ఎన్నో కార్యక్రమాలతో వ్యవసాయ రంగంలో రాష్ట్రం అగ్రగామిగా నిలించిందన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తూ దేశానికే తెలంగాణ దిక్సూచిలా నిలిచిందన్నారు.
నియోజకవర్గంలో రైతు బంధు ఇలా
షాద్‌నగర్ నియోజకవర్గంలో 2018 నుంచి 2023 వరకు 11 సీజన్లలో 82256 మంది రైతులకు సుమారు రూ.702 కోట్లు అందించినట్లు తెలిపారు. అదేవిధంగా 1156 మంది రైతులు చనిపోతే వారికి రైతుబీమా పథకం కింద రూ.63.50 కోట్లను వారి బంధువులకు అందజేయడం జరిగిందన్నారు. రుణమాఫీ కింద మొత్తం 32,526 మంది లబ్ధిదారులను గుర్తించి వారిలో 12,807 మందికి రూ.70.33 కోట్లను మాఫీ చేసినట్లు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి రైతు వేదికలు
గతంలో కరువు ప్రాంతంగా ఉన్న ఈ ప్రాంతం నేడు ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగిందంటే అది సీఎం కేసీఆర్ ఆలోచన సరళితోనే సాధ్యమైందని రాష్ట్ర వ్యవసాయ సహకార యూనియన్ చైర్మన్ రాజవరప్రసాద్ అన్నారు. ఎలికట్ట శివారులో నూతనంగా నిర్మించిన గిడ్డంగుల ప్రారంభోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. నూతనంగా నిర్మించిన ఈ రెండు గిడ్డంగులను రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతు వేదికలు రైతుల సమస్యల పరిష్కారం కోసం సర్కార్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రానున్న రోజుల్లో రైతులకు సాగులో సమస్యలు వస్తే రైతువేదికల్లో ఆధునిక డిజిటల్ పద్ధతిలో వ్యవసాయ శాస్త్రవేత్తలు రైతులతో మాట్లాడి పరిష్కరించేలా చర్యలు తీసుకునేందుకు సర్కార్ రూపకల్పన చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ మృతిపై రెండు నిమిషాలు మౌనం పాటించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ వెంకట్రాంరెడ్డి, ఎంపీపీ ఖాజా ఇద్రిస్ అహ్మద్, ఎలికట్ట, కొండన్నగూడ, దేవునిపల్లి, అన్నారం సర్పంచ్‌లు సాయిప్రసాద్, శ్రీనివాస్‌యాదవ్, రాఘవేందర్‌గౌడ్, రాములుగౌడ్, ఎంపీటీసీ శ్రీశైలం, కౌన్సిలర్ శ్రీనివాస్, నాయకులు నారాయణరెడ్డి, బెందిశ్రీనివాస్రెడ్డి, కట్టావెంకటేశ్గౌడ్, రెబ్బనమోని చంద్రశేఖర్, పీఎస్సీఎస్ వైస్ చైర్మన్ పాండురంగారెడ్డి, హన్యానాయక్, సుష్మరెడ్డి, కృష్ణయ్య, మల్లేష్, దామెదర్‌రెడ్డి, డైరక్టర్లు, ఏడి రాజరత్నం, ఏవో నిశాంత్, విస్తరణ అధికారి తేజ్, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.