Buffalo | కడ్తాల్, జూలై 6 : తలకొండపల్లి మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామంలో ఆదివారం విద్యుత్ షాక్తో రెండు బర్రెలు మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలు… గ్రామానికి చెందిన సింగిరెడ్డి ఎలమందరెడ్డికి చెందిన పశువులు పొలంలో గడ్డి మేస్తుండగా, అంతకుముందే తెగి పడి ఉన్న విద్యుత్ తీగలు రెండు బర్రెలకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాయి. ఏడాది క్రితమే బర్రెలను రూ.2.35 లక్షలకు కొనుగోలు చేసిన్నట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. విద్యుత్ తీగలు తెగి పడటంతోనే బర్రెలు మృతి చెందాయని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని రైతు కోరారు.