షాద్‌నగర్‌రూరల్,ఏప్రిల్22 : జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రెండు బైకులు ఢీ కొనడంతో ఒకరు మృత్యువాత పడ్డారు. ఈ విషాదకర సంఘటన రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ గ్రామ సమీపంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. లింగారెడ్డిగ్రామనికి చెందిన బక్కని యాదయ్య(53) టీవీఎస్ బైక్‌లో పెట్రోల్ పోయించుకోవడానికి షాద్‌నగర్ పట్టణానికి వస్తున్నాడు.
ఇదే సమయంలో వికారాబాద్ జిల్లా కులకచర్ల గ్రామనికి చెందిన వినయ్ తన హోండాషైని బైకుపై షాద్‌నగర్ పట్టణం నుంచి తిమ్మపూర్‌కు వెళ్తూ.. ఎదురుగు వచ్చి యాదయ్య బైక్‌ను ఢీకోట్టడంతో యాదయ్య తలకు తీవ్రగాయలయ్యాయి. వెంటనే అతడిని హైదరాబాద్‌కు తరలిస్తుండుగా మార్గమాధ్యంలో యాదయ్య మృతి చెందాడు.
వినయ్‌కు తీవ్రగాయలై దవాఖానలో చికిత్సపోందుతున్నాడు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలిసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. యాదయ్య మృతితో లింగారెడ్డిగూడ గ్రామంలో విషదఛాయలు అలుముకున్నాయి.