తుర్కయాంజాల్, జూలై 16 : ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. ఆదివారం తుర్కయాంజాల్ మున్సిపాలిటీ సాగర్ రహదారి నుంచి నాదర్గుల్ వరకు రూ.16కోట్ల నిధులతో నూతన బీటీ రోడ్డు నిర్మాణానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. రూ.16 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు ద్వారా అనేక కాలనీలకు రహదారి సమస్య తీరుతుందని అన్నారు. 33ఫీట్ల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. రహదారి విస్తీర్ణంలో అడ్డుగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి నూతన స్తంభాల ఏర్పాటుకు ఎమ్మెల్యే రూ.5 లక్షల నిధులను కేటాయిస్తున్నట్లు తెలిపారు. 2 నెలల్లో బీటీ రోడ్డు పనులను పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీ అభివృద్ధికి నిధులను మంజూరు చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వైస్ చైర్మన్ కొత్తకుర్మ సత్తయ్య, రైతుబంధు సమితి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ కల్యాణ్ నాయక్, కౌన్సిలర్లు కీర్తన, వేముల స్వాతి, భాగ్యమ్మ, రవీందర్‌రెడ్డి, తుర్కయాంజాల్ రైతు సేవా సహకార సంఘం డైరెక్టర్ సామ సంజీవరెడ్డి, మాజీ డైరెక్టర్ అశోక్, ఆర్ అండ్ బీ డీఈ శ్రీనివాస్‌రెడ్డి, మున్సిపాలిటీ డీఈ సత్యనారాయణ, ఏఈలు రంజిత్, గుణాకర్, రాగన్నగూడ మాజీ సర్పంచ్ కందాడి లక్ష్మారెడ్డి, అంజయ్య, బీఆర్ఎస్ మున్సిపాలిటీ అధ్యక్షుడు వేముల అమరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు నర్సింహారెడ్డి, సురేందర్‌రెడ్డి, ప్రేమ్‌కుమార్, శంకర్, విజయానంద్‌రెడ్డి, సుధాకర్, దయానంద్, సుదర్శన్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, శ్రీనివాస్, సంపతీశ్వర్రెడ్డి, నరేందర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, రాజీరెడ్డి, గౌతమ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.