పరిగి, సెప్టెంబర్ 11 : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ప్రథమ వర్ధంతి కార్యక్రమం బుధవారం పరిగిలో జరిగింది. దీనికి మాజీ మం త్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు హాజరై హరీశ్వర్‌రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం హరీశ్వర్‌రెడ్డి సతీమణి గిరిజాదేవిని పరామర్శించారు.
అదేవిధంగా మా జీ మంత్రులు, ఎమ్మెల్యేలు సబితాఇంద్రారె డ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూదనాచారి, చేవెళ్ల మాజీ ఎంపీ రంజిత్‌రెడ్డి, వికారాబాద్, కొడంగల్, తాండూరు, దేవరకద్ర, అచ్చంపేట మాజీ ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, పట్నం నరేందర్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, గువ్వల బాల్‌రాజ్, మా జీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్‌పటేల్, కార్పొరేషన్ మాజీ చైర్మన్ నాగేందర్‌గౌడ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పి.కార్తీక్‌రెడ్డి, గట్టు రాంచందర్‌రావు, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ విజయకుమా ర్లు హరీశ్వర్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించారు. నాలుగు దశాబ్దాలుగా పరిగి ప్రాం తానికి ఆయన చేసిన సేవలను వారు కొనియాడారు. కార్యక్రమంలో హరీశ్వర్‌రెడ్డి సతీమణి గిరిజాదేవి, మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి-ప్రతిమారెడ్డి, కుమారుడు అనిల్‌రెడ్డి-శ్రీదీప్తిరెడ్డి దంపతులు, బీఆర్ఎస్తోపాటు వివిధ పార్టీల నాయకులు, పలువురు అధికారులు పాల్గొన్నారు.