కేశంపేట, మార్చి 28: రంగారెడ్డి జిల్లా కేశంపేట (Keshampet) మండల పరిధిలోని పాపిరెడ్డిగూడలో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మహిళా డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న ఎన్ఎస్ఎస్ క్యాంపు కొనసాగుతుంది. గురువారం గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి గ్రామస్తుల ఆర్ధిక స్థితిగతులు, నిరుద్యోగం, చదువు మధ్యలోనే మాని వేయడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ నీతాపాలె మాట్లాడుతూ.. ఇంటింటి సర్వే విద్యార్థులు మానవ జీవన విధానానికి సంబంధించిన విషయాలను గ్రహిస్తారని, తద్వారా భవిష్యత్తులో వారి జీవితాన్ని ఎలా నిర్మించుకోవాలన్నది అర్ధం చేసుకుంటారన్నారు. సర్వేకు గ్రామస్తుల నుంచి సహకారం మరువలేనిదని, సర్వే విషయాలు విద్యార్థుల జీవితాలకు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రొగ్రాం ఆఫీసర్లు అప్రొజ్ జహాన్, ఉమ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, గ్రామస్తులు పాల్గొన్నారు.