గిరిజనుల గోస తీర్చిన ఘనత కేసీఆర్
గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని గిరిజన, శిశు, సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం మహేశ్వరం మండల పరిధిలోని తుక్కుగూడలో గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో,
- ప్రత్యేక గ్రామ పంచాయతీలతో తండాలకు మహర్దశ
- గిరిజనులను ఓటు బ్యాంక్‌గానే చూసిన బీజేపీ, కాంగ్రెస్‌లు
- మంత్రి సబితారెడ్డిని మరోసారి గెలిపించుకోవాలి
- గిరిజనుల ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సత్యవతి రాథోడ్
మహేశ్వరం, నవంబర్ 6: గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని గిరిజన, శిశు, సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సోమవారం మహేశ్వరం మండల పరిధిలోని తుక్కుగూడలో గిరిజన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీలు గిరిజనులను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చి గిరిజనులకు ఆత్మగౌరవాన్ని కల్పించడంతోపాటు పోడు భూముల పట్టాలను అందజేసి వారి గోస తీర్చారన్నారు.
బీఆర్ఎస్తోనే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా అహర్నిశలు కృషి చేస్తున్న సబితారెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం మంత్రి సబితాఇంద్రారెడ్డి మాట్లాడుతూ గిరిజన గ్రామాల్లో స్వయం పాలనను అందించిన గొప్ప మనసున్న నేత సీఎం కేసీఆర్ అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతికి పాటుపడుతున్న బీఆర్ఎస్ను మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గిరిజన తండాల్లో రోడ్లు, మంచి నీటి వసతులను కల్పించడంతోపాటు పంచాయతీలకు పక్కా భవనాలను నిర్మిస్తున్నామన్నారు. తనను మరోసారి గెలిపించి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించాలని ఆమె కోరారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | పిల్లలకు ఇంటర్నెట్పై నిషేధం తగదు.. కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశం
FSSAI | బిస్కెట్లలో దాణా.. పాలల్లో డిటర్జెంట్.. మూడు కంపెనీలపై ఎఫ్ఎస్ఎస్ఏఐ కేసులు
Uttarakhand | సీఎం సార్..నా భార్య అవినీతి లెక్క తేల్చండి..! ఉత్తరాఖండ్ మహిళా మంత్రిపై భర్త ఆరోపణలు
RTC Elections | ఆర్టీసీ ఎన్నికల ఫలితాలు తారుమారు?.. కాంగ్రెస్ అనుబంధ సంఘానికి కట్టబెట్టే యత్నం
Delhi Police | పోలీసుల దాష్టీకాలపై కదం తొక్కిన మహిళలు.. కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

