రంగారెడ్డి, మార్చి 20 (నమస్తే తెలంగాణ): జిల్లాలో నేటి నుంచి జరుగనున్న పదోతరగతి పరీక్షలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం 51,794 మం ది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా 249 కేంద్రాలను ఏర్పాటు చేశారు. అం దులో ప్రైవేట్ పాఠశాలలు 145, ఎయిడెడ్ పాఠశాలలు 3, కేజీబీవీలు 1, జడ్పీహెచ్ఎస్లు 85, టీజీఎంఎస్ 7 ఉన్నాయి. ఉద యం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి. పరీక్షలు ఏప్రిల్ 2న ముగియనున్నాయి.
పదోతరగతి పరీక్షలు నిఘా నీడలో జరుగనున్నాయి. మాస్ కాపీయింగ్‌కు అవకాశం లేకుండా పదిమంది ఫ్లయింగ్స్కాడ్లు, 249 మంది సిట్టింగ్స్కాడ్లను ఏర్పాటు చేశారు.
22 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్‌ను నియమించారు. కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండనున్నది. కేంద్రాలకు సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను మూసివేయనున్నారు. కాగా, నాలుగు ఎయిడెడ్ పాఠశాలల నుంచి 156 మంది విద్యార్థులు పరీక్షలు రాయనుండగా.. ఒక్క ఎస్ఆర్ఏఎం నుంచి 47 మంది, 16 బీసీడబ్ల్యూఎస్ఆర్ల నుంచి 1029, నాలుగు ప్రభుత్వ పాఠశాలల నుంచి 320, 20 కేజీబీవీల నుంచి 932, 721 ప్రైవేట్ పాఠశాలల నుంచి 34,910, 9 టీఎంఆర్ఈఎస్ఐల నుంచి 492, 9 టీఎస్ఎంఎస్ల నుంచి 783, 15 టీఎస్డబ్ల్యూఆర్ఎస్ల నుంచి 1133, 3 టీటీడబ్ల్యూఆర్ఎస్ల నుంచి 174, 238 జడ్పీహెచ్ఎస్ల నుంచి 11,718 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
9:35 లోపే అనుమతిస్తారు..
విద్యార్థులు సమయానికి ముందే పరీక్షా కేం ద్రాలకు చేరుకోవాలి. ఉదయం 9:35 గంటలకు గేట్లు మూసేస్తారు. ఆ తర్వాత వచ్చే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ లోపలికి అనుమతించరు. విద్యార్థులు హాల్‌టికెట్‌తోపాటు పరీక్ష ప్యాడ్, నీలం లేదా నలు పు బాల్ పాయింట్ పెన్నులను మాత్రమే తీసుకెళ్లాలి.- సుశీందర్‌రావు, రంగారెడ్డి డీఈవో