పుణె, ఫిబ్రవరి 17: ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ బజాజ్ ఆటో లిమిటెడ్… మహిళా టీ-20 లీగ్‌లో గెలుపొందిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు మహిళా టీం ప్రతి ఒక్క సభ్యురాలుకు నూతన చేతక్ సీ25ని బహుమతిగా అందచేస్తున్నట్టు సంస్థ ప్రకటించింది. ఇప్పటికే ఆర్సీబీ మహిళా టీమ్‌కు భాగస్వామిగా వ్యవహరిస్తున్న చేతక్..
తాజాగా ఐపీఎల్ మహిళా టీమ్ విజేతలకు ఉచితంగా స్కూటర్‌ను ఇస్తున్నట్టు కంపెనీ ప్రెసిడెంట్ సుమీత్ నారంగ్ తెలిపారు.