మిలియన్ డాలర్ల కలను చిదిమేసిన ర్యాష్ డ్రైవింగ్!
ఓ మైనర్ ఎస్యూవీని రాంగ్ రూట్లో వేగంగా నడపడం ఓ యువ ప్రతిభావంతుడి ప్రాణాలతో పాటు అతడి మిలియన్ డాలర్ కలను చిదిమేసింది. విషాదకరమైన ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని ద్వారకలో ఈ నెల 3న జరిగింది. మృతుడి ఇంట్లో అతడి గదిని పరిశీలించినప్పుడు అతడు రాసుకొన్న ప్రణాళికలు, అతడి ప్రతిభకు లభించిన పురస్కారాలు ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించాయి.
- ఢిల్లీ యువకుడి జీవితాన్ని బలిగొన్న మైనర్!
ద్వారక: ఓ మైనర్ ఎస్యూవీని రాంగ్ రూట్లో వేగంగా నడపడం ఓ యువ ప్రతిభావంతుడి ప్రాణాలతో పాటు అతడి మిలియన్ డాలర్ కలను చిదిమేసింది. విషాదకరమైన ఈ ఘటన పశ్చిమ ఢిల్లీలోని ద్వారకలో ఈ నెల 3న జరిగింది. మృతుడి ఇంట్లో అతడి గదిని పరిశీలించినప్పుడు అతడు రాసుకొన్న ప్రణాళికలు, అతడి ప్రతిభకు లభించిన పురస్కారాలు ప్రతి ఒక్కరినీ కంట తడి పెట్టించాయి. ‘సొంతంగా విమానం కలిగి ఉండాలి లేదా ఒక మిలియన్ డాలర్ల ఆస్తి కలిగి ఉండాలి’ అనేది మృతుడు సహిల్ ధనేశ్ర(23) కల. తన కలను నెరవేర్చుకోవడం కోసం అతడు బాగా చదివేవాడని అతడి గది నిండా ఉన్న పుస్తకాలు, ల్యాప్టాప్ తెలియజేశాయి. ‘వాళ్లు మొదటి తరగతిలో విమాన ప్రయాణం చేయాలనుకొంటారు. నేను ఒక విమానానికి యజమానిగా ఉండాలనుకొంటున్నాను’ అని అతడు తన గదిలోని పోస్టర్ మీద రాసుకొన్నాడు. అతడి గదిలో డజన్ల కొద్దీ పతకాలు వేలాడుతూ కనిపించాయి. ‘అత్యాశ ప్రతిభను జయిస్తుంది’, ‘2025 నా సంవత్సరం అవుతుంది’, ‘మిలియన్ డాలర్ల సంవత్సరం’ అని తన గది గోడల మీద అతడు రాసుకొన్న మాటలు అతడి కలలను పరిచయం చేశాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dushyant Kumar Gautam | బీజేపీ నేత దుష్యంత్ కుమార్ గౌతమ్ను.. సిక్కిం గవర్నర్గా నియమించడంపై నిరసనలు
YS Jagan | ఎన్నికల నిర్వహణకు కేంద్ర బలగాలను రప్పించాలి.. ఎస్ఈసీకి వినతిపత్రం అందజేసిన వైఎస్ జగన్
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

