శ్రీనగర్, ఫిబ్రవరి 17: జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించటంపై కేంద్రం త్వరలో నిర్ణయం తీసుకుంటుందని కేంద్ర న్యాయమంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ అన్నారు. శ్రీనగర్‌లోని ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. రాష్ట్ర హోదా పునరుద్ధరణ అనేది చాలా సున్నితమైన అంశమని, దీనిపై త్వరలో ఓ నిర్ణయం వెలువడుతుందని ఆయ న అన్నారు.
ఈ అంశంపై మంత్రి అమిత్ షా ఇప్పటికే లోక్‌సభలో స్పష్టమైన హామీ ఇచ్చారని, సరైన ప్రకియతో దీనిని చేపడతామని చెప్పారని మేఘ్వాల్ అన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై సీఎం ఒమర్ అబ్దులా స్పందిస్తూ, రాష్ట్ర హోదాపై ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వం నిరంతరం కేంద్రంతో టచ్‌లో ఉన్నదని, అయితే ఈ ప్రక్రియపై అనుకున్న దాని కన్నా ఎక్కువ సమయం పట్టిందని ఆయన అన్నారు.