మట్టి గణపతినే పూజిద్దాం..
పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక సేవా సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్కై ఫౌండేషన్,
- నగర వాసులకు అవగాహన కార్యక్రమాలు
- పీసీబీ ఆధ్వర్యంలో క్విజ్ పోటీలు
- రూ.10లక్షల వరకు నగదు బహుమతులు
సిటీబ్యూరో, సెప్టెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పర్యావరణానికి హాని కలిగించే రసాయనాలతో తయారు చేసిన విగ్రహాలు కాకుండా మట్టి విగ్రహాలను ప్రతిష్టించుకోవాల్సిన అవసరం ఉందని సామాజిక సేవా సంస్థలు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. స్కై ఫౌండేషన్, జగతి ఫౌండేషన్, హెల్పింగ్ స్పాట్, ఎంవీ ఫౌండేషన్ తదితర సంస్థలు మట్టితో తయారు చేసిన గణపయ్యలకే ప్రాధాన్యత ఇవ్వాలని పిలుపునిచ్చాయి. అందులో భాగంగా నగరంలోని స్కూల్స్, హాస్టల్స్, కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.
బంకమట్టి విగ్రహాలే ఉత్తమం
కాలుష్య సమస్య నుంచి గట్టెక్కేందుకు బంకమట్టితో తయారు చేసిన విగ్రహాలే ఉత్తమమని పర్యావరణ నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా నిమజ్జనం చేసిన తర్వాత కుంటలు, చెరువుల్లో నీటి వనరులకు ఎలాంటి హాని ఉండదని వివరించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ సహా కృత్రిమ రంగుల్లో పాదరసం, సీసం, కాడ్మియం, క్రోమియం వంటి విషపూరిత రసాయనాలు నిక్షిప్తమై ఉంటాయని, ఇవి నేలపై చేరి తీవ్ర హాని తలపెడుతాయని తెలిపారు. కూరగాయలు, ఆకు కూరలతో పాటు నీటిలో ఉండే చేపలు, రొయ్యలు ద్వారా మనిషి శరీరంలోకి రసాయనాలు చేరి ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. క్యాన్సర్‌తోపాటు మూత్రపిండాలు, కాలేయం, జీర్ణకోశ, చర్మ సంబంధిత వ్యాధులకు కారణమవుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

